సూర్యుని అనుగ్రహం కలగాలంటే.. వీటిని దానం చేయండి..!

 

 


సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో కూడా సూర్యుడిని దైవంగా కొలిచే సంప్రదాయం ఉంది. సూర్యుడిని ఆదిత్యుడు, దినకరుడు, భాస్కరుడు అని పలు రకాల పేర్లతో కూడా సంభోదిస్తారు. సూర్యుడికి ఆదివారం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు సూర్యుడి అనుగ్రహం కోసం కొన్ని వస్తువులను దానం చేయవచ్చు.  సాధారణంగానే దానం వల్ల లభించే ఫలం చాలా గొప్పగా ఉంటుంది. ఇక ఆయా గ్రహాలకు ప్రత్యేకమైన రోజున, ఆయా గ్రహాలకు ప్రత్యేకంగా సమర్పించే లేదా ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల గ్రహాల అనుగ్రహం ఉంటుందని చెబుతారు.  సూర్య అనుగ్రహం కోసం ఆదివారం కొన్ని దానం చేయాలి. దీని వల్ల దానం చేసిన వ్యక్తులకు ఐశ్వర్యం, ఆరోగ్యం,  గౌరవం, కీర్తి మొదలైనవి అన్నీ లభిస్తాయట.


గోధుమలు..

ఆదివారం రోజు బరువుకు సమానమైన గోధుమలను తూచి వాటిని దానం చేస్తే వ్యాపారంలో పురోగతి వస్తుందట.

పాయసం..

ఆదివారం రోజు సూర్యుడికి బెల్లం, బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ఇంట్లో అశాంతి, గొడవలు వంటివి ఉంటే అవన్నీ మెల్లగా సద్దుమనుగుతాయి.

ఎరుపురంగు పువ్వులు..

ఆదివారం రోజు ఎరుపు రంగులో ఉన్న పువ్వలను దానం చేయడం కూడా చాలా శ్రేయస్కరం.  దీని వల్ల ప్రతి రంగంలోనూ విజయాలు లభిస్తాయి.  ఇంట్లో కష్టాలు తీరుతాయి.

మంత్రం..

ఆదివారం రోజున ఎర్ర చందనంతో చేసిన జపమాలతో సూర్య భగవానుడి మంత్రాన్ని జపం చేయాలి.  ఇలా చేస్తే వ్యక్తిలో ధైర్యం పెరుగుతుంది.

బట్టలు..

ఆదివారం రోజు బెల్లం, పాలు, బియ్యం, బట్టలు మొదలైనవి దానం చేయాలి. ఇలా చేస్తే కుటుంబంలో సంతోషం కలుగుతుంది.  ఆదాయం కూడా పెరిగి కుటుంబం వృద్ధి చెందుతుంది.


                                                    *రూపశ్రీ.


More Aacharalu