కాణిపాక క్షేత్రం

Information Kanipakam is a village located in Irala mandal of Chittoor district, Andhra Pradesh in South India. Sri Swayambu Varasidhi VinayakaSwamy.

కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది.స్వామివారు ఇక్కడబావిలో స్వయంభూగా వెలిసాడు. ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది. ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది. అదే నీటిని భక్తులకు తీర్ధం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు. మరో విశేషమేమిటంటే ఎపూడూ నీళ్ళతో ఉండే ఈ బావిచుట్టూపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది.

స్ధలపురాణం -

Information Kanipakam is a village located in Irala mandal of Chittoor district, Andhra Pradesh in South India. Sri Swayambu Varasidhi VinayakaSwamy.

పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి ఉండేదట. అభూమిలో ఏతంతొక్కడానికి ఒక చిన్నబావిని తవ్వరట. అయితే కొంతకాలానికి ఆప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలకపోవడంతో బావిని ఇంకాలోతుగా తవ్వాలని నిర్ణయించుకుని ముగ్గురూ కలిసి తవ్వడం ప్రారంభించారట. తవ్వగా తవ్వగా కొంతసేపటికి గునపం రయికి తగిలి ఉవ్వెత్తున రక్తం వారిమీద చిందిందట.ఆ రక్తం మీద పడగానే మూగ,గుడ్డి,చెవిటి వారైన ఆ అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములుగా తయారయ్యారట.ఈవార్త ఆప్రాంతం అంతా దావానంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చుడంగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహనికి ఆలయం నిర్మించారట. ఇప్పటికి స్వామి అంతరాలయం బావిలోనే ఉంటుంది.

ఇక్కడ నిర్వహించు పండుగలు ఉత్సవాలు -

Information Kanipakam is a village located in Irala mandal of Chittoor district, Andhra Pradesh in South India. Sri Swayambu Varasidhi VinayakaSwamy.

కాణిపాకంలో వినాయకచవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.20 రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలను చూడటానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు.

ఉత్సవాలు - వాహనాలు -

గ్రామొత్సవం - హంసవాహనం
రధోత్సవం - నెమలివాహనం
తిరు కళ్యాణం - మూషికవాహనం
శేషవాహనం
వృషభవాహనం
గజవాహనం
ఎంతదూరం?
తిరుపతి -65 కిమి
చిత్తూరు -12 కిమి
చెన్నై -165 కిమి
హైదరాబాద్ -562కిమి
విజయవాడ - 386 కిమి

ఎలావెళ్ళాలి ?

Information Kanipakam is a village located in Irala mandal of Chittoor district, Andhra Pradesh in South India. Sri Swayambu Varasidhi VinayakaSwamy.

రాష్ట్రంలోని అన్నిప్రాంతాలనుండి కాణిపాకకు రవాణా సౌకర్యం కలదు.ఈక్షేత్రానికి అనేక మార్గాల ద్వారా చేరుకొవచ్చు.
రోడ్డు మార్గం - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుండి కాణిపాకకు రోడ్డు మార్గం ఉంది. వివిధ ప్రాంతాల నుండి ఏ.పి.యస్.ఆర్.టీ.సి బస్సులు నడుపుతుంది. ఇంకా తిరుపతి నుండి కారు, జిప్లలో ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలుమార్గం - రైలుమార్గ ద్వారా చేరుకొవాలనుకునేవారు తిరుపతి స్టేషన్ లో దిగి ఇక్కడికి చేరుకొవచ్చు.

ప్లైట్ - ప్లైట్ ద్వారా కాణిపాకం చేరుకోవాలనుకునేవారు దగ్గరలోని ఎయిర్ పోర్ట్ రేణి గుంట నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.

More Punya Kshetralu