కాలసర్ప దోషంతో ఎలాంటి హాని కలుగుతోంది... 2024లో ఇలా చేస్తే అన్నీ శుభాలే!

కాలసర్ప దోషం ఉన్నవారికి కొత్త ఏడాది 2024 మంచి సమయం. కాలసర్ప దోషం ఉంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఈ కొత్త ఏడాదిలో ఆర్థిక  పురోభివృద్ధి ఉండ‌బోతోంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు లేదా శని అనే 7 ప్రధాన గ్రహాలతో ఏదైనా రాహువు, కేతువుల మధ్య ఉన్నప్పుడు సర్పదోషం లేదా కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఈ యోగాతో బాధపడే వ్యక్తం గతంలో చేసిన కొన్ని పనుల వల్ల అనుకోని వైఫల్యాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. జీవితంలో ఊహించని ఎత్తుపల్లాలు రావచ్చని జ్యోతిశాస్త్రం చెబుతోంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు, నక్షత్రాల కదలికల వల్ల శుభ, అశుభ యోగాలు తరచుగా ఉంటాయి. జాతకంలో శుభయోగం ఉంటే సంబంధిత వ్యక్తికి మేలు జరుగుతుంది. అశుభ యోగాలు, దోషాల వల్ల అతని జీవితంలో కొన్ని తాత్కాలిక సమస్యలు వస్తుంటాయి. అలాంటి దుష్ప్రవర్తన యోగాలలో ఒకటి కాలసర్ప దోషం. ఈ దోషం శాపంగా పరిగణిస్తారు. 2024కొత్త ఏడాదిలో కాలసర్ప దోషం ఉన్నవారికి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మానసిక ప్రశాంతత కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రమాదాలకు కారణమయ్యే ధోరణి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అగ్ని, నీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రేమికులకు మంచి జరుగుతుందట. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయని పండితులు అంటున్నారు. కానీ పెళ్లయిన వారికి వైవాహిక కలహాలు ఏర్పడవచ్చంటున్నారు. అయితే ఈ సర్పదోషం నుంచి ఉపశమనం పొందేందుకు సోమవారం నాడు రోజంతా భోజనం చేయకుండా శివుని తలపై నీళ్లు పోసి బెల్లం, పూలు దానం చేయండి. ఇలా 54 సోమవారాలు చేస్తే కాలసర్ప దోషం ఉన్నవారికి మేలు జరుగుతుందంటున్నారు. అయితే మద్యం సేవించే వారు 2024లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం మంచిది కాదన్నారు. హోమం, యజ్నం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.


More Aacharalu