భక్తుల పాలిట కల్పవల్లి... జొన్నవాడ

కామాక్షితాయి

 

Information about goddess jonnawada sri kamakshi tai temple history in nellore city

 

పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అప్పచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి. శ్రీ పొట్టిశ్రీ రాము లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు ఈడేర్చు తూ భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతోంది.

ఆలయ ప్రాశస్థ్యం..

Information about goddess jonnawada sri kamakshi tai temple history in nellore city

 

ప్రజాపతులలో శ్రేష్ఠుడైన శ్యప ప్రజాపతి యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్విహంచారు. పవిత్ర పినాకినీ (పెన్న) నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షణాగ్ని, ఆహావనియాగ్ని, ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు. శ్యపుని యజ్ఞయాగానికి పరవశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించినట్లు స్కందపురాణంలో చెప్పబడివుంది. అప్ప టి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి గాంచింది.

 

Information about goddess jonnawada sri kamakshi tai temple history in nellore city

 

స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతిదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది. అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో వుండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శిలారూపం దాల్చింది. అనంత కాలంలో జాల ర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించి సేవించనారంభించా రు. నాలుగోశతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లిఖార్జున స్వామి గాను పార్వతి దేవి కామాక్షితాయిగాను భక్తకోటి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురా ణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది.

పినాకిని తీర్థం సర్వపాపహరణం

 

Information about goddess jonnawada sri kamakshi tai temple history in nellore city

 

దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న విత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ద్వారపయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృశపర్వుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరినఇంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడ వ్వడమేకాకుండా రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడైనాడు.
త్రేతాయుగంలో కుష్ఠువ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్తత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమ యాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడి నుంచే ప్రారంభించి నట్లు చెబుతారు. పురాణ కాలం నుంచి ప్రసిద్ధిచెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్ధాలు పూజాపునస్కారాలకు నోచు కోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది. 13వ శతాబ్ధంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించి నట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగత మవుతుంది. 1969 ఏఫ్రిల్‌ మాసంలో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖ రేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మ వారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి జొన్నవాడక్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది.

 

Information about goddess jonnawada sri kamakshi tai temple history in nellore city

 

శైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపం డువగా జరగుతాయి. 9 రోజుల పాటు నిర్వ హించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల ల నుండే గాక పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, మహారాష్ట్ర, ఒడిషాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తు న్నారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినిలో తీర్థ మాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్నప్ప దర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు ఈడేరుస్తారని భక్తుల నమ్మిక.

 

Information about goddess jonnawada sri kamakshi tai temple history in nellore city

 

ఇంతటి ప్రాచీన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొంత కాలం కాలగర్భంలో కలిసిపోయింది. దుర్వాసముని శాపానికి నది పొంగి ఆలయం నీటమునిగింది. కొంత కాలానికి పశువుల కాపరికి వింతకాంతిలో శివలింగం దర్శనమిచ్చింది. శివలింగం ప్రతిష్ఠాపన జరిగిన మరి కొంతకాలానికి బెస్తవారు విసిరిన వలలో అమ్మవారి విగ్రహం లభించింది. దీంతో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంచి మాంసాహారాన్ని నైవేద్యం పెట్టి పూజలు చేసేవారు బెస్తవాళ్లు. అయితే రాత్రిసమయాలలో అమ్మవారి భీకర శబ్దాలతో భయపడిన బెస్తవాళ్లకు ఆదిశంకరాచార్యులు రాకతో ప్రశాంతత లభించింది. మాంసాహార నైవేద్యాన్ని నిషేధించి, వైదికపద్ధతిలో పూజలు జరిపారాయన. నాటినుంచి అమ్మవారు శాంత స్వభావురాలయ్యారు. భక్తుల చీడపీడలను తొలగిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ, స్వప్నదర్శనమిస్తూ భక్తులు కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి అమ్మవార్లు.

కొడిముద్ద లేదా ధ్వజప్రసాదం

 

Information about goddess jonnawada sri kamakshi tai temple history in nellore city

 

 

ఈ సందర్భంగా పూజారులు ధ్వజస్తంభానికి అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు. వీరు సమర్పించే ధ్వజప్రసాదం లేదా కొడిముద్ద తిన్న వారికి ఆయురారోగ్యాలు పెంపొందుతాయని, సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కొడిముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. ఆరోతేదీన గిన్నెభిక్ష జరుగుతుంది. శివుడు భవతీభిక్షాందేహీ అంటూ భిక్షాటన చేసినందుకు గుర్తుగా ఈ గిన్నెభిక్ష ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అంశమైన రథోత్సవం ఏడోతేదీ ఉదయం జరగనుంది. అదేరోజు రాత్రి గజసింహవాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఎనిమిదో తేదీ ఉదయం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. తొలుత స్వామివారిని ఓ వైపు, అమ్మవారిని ఓ వైపు ఉంచి ఎదుర్కోలమహోత్సవాన్ని నిర్వహిస్తారు. అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కల్యాణ సంకల్పం గావిస్తారు.


More Punya Kshetralu