ఆంజనేయుడు పంచముఖాలు ఎందుకు

దాల్చాడు

 

Information about Panchmukhi Hanuman and the story behind the five faces of Hanuman

 

పంచముఖ అంజనేయ స్వామి  అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయస్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. రామ-రావణ యుద్ధంలో రావణుడు పాతాళానికి అధిపతి అయిన మహిరావణుడి సాయం కోరుకుంటాడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయనమందిరము (తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను వెదకడానికి పాతాళానికి వెళతాడు. పాతాళంలో వివిధ దిక్కులలో వున్న ఐదు దీపాలను ఒకేసారి విచ్చిన్నం చేస్తా మహిరావణుడు ప్రాణాలు విడుస్తాడని తెలుసుకున్న ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయస్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా, గరుడం వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చిన్నం చేసి (ఆర్పి) శ్రీరామలక్ష్మణులను కాపాడుకుంటాడు.

 

Information about Panchmukhi Hanuman and the story behind the five faces of Hanuman

 

ఆంజనేయస్వామి తూర్పుకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు గరుడు, పడమటి దిక్కువైపు ఆసీనుడై ఆయుర్ధాయ కాలాన్ని పెంపొందించేవాడు వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు నరసింహ, దక్షిణాముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు. హయగ్రీవుడు, నాలుగు ముఖాలకు పైన ఆసీనుడై ఉంటాడు. భక్తీ, జ్ఞాన వృద్ధికి కారకుడు. పరమగురు శ్రీ గురురాఘవేంద్ర స్వామికి ఆరాధ్యుడు పంచముఖ ఆంజనేయుడు కుంభకోణంలో ప్రసిద్ధి చెందిన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు.


More Hanuman