సిరిసంపదలు ఉంటే...

 

 

శ్రీగల భాగ్యశాలిఁగడుఁజేరఁగవత్తురు తారుదారె దూ

రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వను

ద్యోగముచేసి; రత్ననిలయుండని కాదె సమస్త వాహినుల్

సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!

 

రత్నాలు ఉన్న సముద్రుని దగ్గరకు నదులన్నీ ప్రకృతి సిద్ధంగా వస్తాయి కదా! అలాగే సిరిసంపదలు ఉన్న భాగ్యశాలి చెంతకి జనులు పిలవకుండానే పరుగుపరుగున చేరుకుంటారు. వ్యయప్రయాసలకు ఓర్చి, శ్రమను సహించి అతని చెంతకు చేరతారు. 

 

..Nirjara


More Bhakti Content