ఎంగిలిపూల బతుకమ్మకు...ఆ పేరు ఎలా వచ్చిందంటే?

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. బతుకమ్మ పండగ అంటేనే వాడంతా సందడి నెలకొంటుంది. బతుకమ్మ పాటలతో, ఆటలతో హడావుడి ఉంటుంది. 9రోజుల పాటు సాగే బతుకమ్మ సంబురాలు ఏరోజు కారోజే చాలా ప్రత్యేకం. ఒక్కోరోజు ఒక్కోరకమైన బతుకమ్మను పేర్చుతారు. రోజు రకం ప్రసాదాన్ని బతుకమ్మను నివేదిస్తారు. మొదటిరోజు బతుకమ్మను పెత్రఅమావాస్య రోజు పేర్చుతారు. ఈరోజు బతుకమ్మ మొదటిరోజు సంబురాలు షురూ అయ్యాయి. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు.

ఎంగిలిపూల బతుకమ్మ  అని ఆ పేరేలా వచ్చింది?

బతుకమ్మను అందంగా పేర్చడం అనేది ఒక కళ. పూల కాడలన్నీ సమానంగా ఉంచి బతుకమ్మను పేర్చుతుంటారు. ఒక్కో పువ్వును పెట్టుకుంటూ పేర్చుతుంటారు. బతుకమ్మ పండగకు ఒకరోజు పూలను తీసుకువచ్చి నీళ్లలో ఉంచి మరుసటి రోజు బతుకమ్మను పేర్చుతారు. అందుకే ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు.

ఏరోజు ఏ బతుకమ్మను పేర్చుతారు?

2వ రోజు:

రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

3వ రోజు:

మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తుంటారు. ఈరోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో నైవేద్యం నివేదిస్తారు.

4వ రోజు:

బతుకమ్మ పండుగలో నాలుగో రోజున నానబియ్యం బతుకమ్మఅంటారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

5వ రోజు:

ఐదోరోజు అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు దోసలు వేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

6వ రోజు:

ఈ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు.

7వ రోజు:

ఏడో రోజును వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి.. నూనెలో వేయిస్తారు. ఇవే బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

8వ రోజు:

ఈరోజును వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లంలాంటి పదార్థాలు బతుకమ్మకు  నైవేద్యంగా సమర్పిస్తారు.

9వ రోజు:

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఈరోజు చాలా ముఖ్యమైంది.  ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని రకరకాల పేరులతో పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం,, నువ్వుల అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 
 


More Bathukamma