ఆర్థిక ఇబ్బందులు, శత్రు సమస్యలు.. ఏదైనా సరే.. పుట్టిన తేదీకి ఈ ఒక్క పరిహారం చేయండి!

శాస్త్రీయంగా చూస్తే మనిషి పుట్టుక సైన్స్ గా చెబుతారు. కానీ హిందూ ధర్మంలో జీవి పుట్టుక అనేది 84 లక్షల సంవత్సరాల తర్వాత దొరికే వరం అని చెబుతారు. అది కూడా ప్రతి మనిషి జననం నక్షత్రాలు, గ్రహాలు, రాశులు,  సమయం ఆధారంగా నమోదు అవుతుంది. ఇవి మాత్రమే కాక పుట్టిన తిథి కూడా మనిషి జీవితం పై ఎంతో ప్రభావితం చూపిస్తుంది. మనిషి జీవితంలో కష్టాలు,  సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు,  శత్రు సమస్యలు ఇలా ఎన్నో ఉంటాయి.  వాటిని అధిగమించడం ఎలా అనేది చాలా మందికి అర్థం కాదు.  అయితే పుట్టిన తిథి ప్రకారం ఒకే ఒక్క పరిహారం చేయడం వల్ల సమస్యల నుండి ఎంతో ఉపశమనం ఉంటుంది.  అదేంటో తెలుసుకుంటే..

పుట్టిన తేదీ కాదు.. పుట్టిన తిథి..

అసలైన పుట్టిన తేదీ ఆంగ్ల క్యాలెండర్‌లోని తేదీ కాదని,  పుట్టిన తిథి  అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే భారతీయ జ్యోతిషశాస్త్రంలో, పుట్టినరోజు కంటే పుట్టిన తిథికి  ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ తేదీ చంద్రుడు, సూర్యుని మధ్య ఏర్పడే కోణంపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు, కాబట్టి పుట్టిన తేదీ మన మనస్సు, కర్మ, విధి , ఆధ్యాత్మిక శక్తితో నేరుగా ముడిపడి ఉంటుంది.

తిథి అంటే..

సూర్యచంద్రుల మధ్య 12 డిగ్రీల దూరం ఏర్పడినప్పుడు తిథి పూర్తవుతుంది. మొత్తం 30 తిథులు ఉన్నాయి. శుక్ల పక్షంలో 15, కృష్ణ పక్షంలో 15. ప్రతి తిథికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈ దేవతలు ఆ తిథిలో జన్మించిన వ్యక్తిని  రక్షిస్తారు. ఒక వ్యక్తి తమ తిథి దేవతను నమ్మి, పూజించి, స్మరించినప్పుడు, వారి జీవితంలోని ఆటంకాలు తగ్గడం ప్రారంభమవుతాయి.

తిథికి సంబంధించిన దేవతను ఆరాధించడం ఎందుకు ముఖ్యం..

ప్రాచీన నమ్మకం ప్రకారం పుట్టిన తిథికి  సంబంధించిన దేవత మనిషి చర్యలకు సాక్షిగా,  రక్షకుడిగా ఉంటుందట. సంక్షోభం, మానసిక అశాంతి, ఆర్థిక సమస్యలు, శత్రు అడ్డంకులు లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పుడు,  పుట్టిన తిథికి సంబంధించిన దేవతను పూజించడం అద్భుతమైన రక్షణను అందిస్తుందట.

బిడ్డ తమ తల్లిదండ్రుల ఒడిలో సురక్షితంగా భావించినట్లే, ఆత్మ తన జనన తిథికి సంబంధించిన  దేవతతో అనుసంధానం కావడం ద్వారా బలాన్ని పొందుతుందట.

                              *రూపశ్రీ.


More Aacharalu