ధన త్రయోదశి రోజు ఈ దేవతలను పూజిస్తే డబ్బుల వర్షం కురవడం ఖాయం..!

 


ధన త్రయోదశికి భారతీయ హిందూ క్యాలెండర్ లో చాలా ప్రత్యేకత ఉంది.  దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా పిలుస్తారు.  ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, విలువైన వస్తువులు కొనడం కొందరికి అలవాటు. దీని వల్ల సంపద అభివృద్ది చెందుతుందని. ఇంట్లో ధనానికి లోటు ఉండదని,  లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అంటారు.  అయితే ధన త్రయోదశి  రోజు దేవతారాధన కూడా చాలా ప్రాముఖ్యత పొందింది.  ఈరోజు కింద చెప్పబడిన దేవతలను పూజిస్తే ధనానికి లోటు ఉండదని, ధనం వర్షంలా కురుస్తుందని అంటారు. అంతే కాదు ధన త్రయోదశి రోజు కొన్ని పనులు చేయడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. దేవతల అనుగ్రహం కలిగి కుటుంబం సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది.


ధన త్రయోదశి రోజున అయిదు దేవతల ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది.  ధనానికి అధిపతి అయిన కుబేరుడు. లక్ష్మీదేవి,  యముడు,  ధన్వంతరి,  వినాయకుడు.. ఈ అయిదు దేవతల ఆరాధన చేయడం చాలా ముఖ్యం.


ధన త్రయోదశి రోజునన ఇంటి లోపల,  సాయంత్రం సమయంలో ఇంటి ముఖ ద్వారం వద్ద యమ నామంతో  13 దీపాలను వెలిగించాలట. ఇది కూడా ఇంటిలో అందరూ నిద్రపోయిన తరువాత ఈ దీపాలు వెలిగించాలట. ఇంకా ధన త్రయోదశి రోజున దీప దానం చేస్తే ఆ ఇంట్లో ఎప్పటికీ అకాల మరణాలు సంభవించవని పండితులు చెబుతున్నారు.

ధన త్రయోదశి రోజున ఇంటికి దనియాలు కొని తీసుకురావడం వల్ల మంచి జరుగుతుందట.

ధన త్రయోదశి రోజు పసుపు రంగు వస్తువులు కొంటే చాలా మంచిది.  బంగారం కొనలేని వారు పసుపు రంగులో ఉన్న వస్తువులు కొనవచ్చు. ఇత్తడి లేదా రాగి పాత్రలు అయినా కొనుగోలు చేయవచ్చు.


ధన త్రయోదశి రోజున చేసే దానం చాలా పుణ్యం తెచ్చిపెడుతుంది.  ఈ రోజున పంచదార,  పాయసం,  బియ్యం,  చక్కెర పాకంతో తయారుచేసిన చక్కెర అచ్చులు,  తెల్లని వస్త్రం  మొదలైన తెలుపు రంగు వస్తుపులు  దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.


ధన త్రయోదశి రోజు చీపురు కొంటే చాలా మంచిది. ప్రతి ఇంట్లో చీపురును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈరోజున చీపురు కొంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువచ్చినట్టే.

                                           *రూపశ్రీ.


More Deepavali