ఆంధ్రదేశంలో అతి పెద్ద స్థూపం

చందవరం బౌద్ధారామం

Chandavaram Buddha Stupa

రామాలయం, శివాలయం తదితర ఆలయాలు ప్రతి ఊర్లో కనిపిస్తాయి కానీ బౌద్ధారామాలు దేశంలోనే తక్కువ. ఆంధ్ర రాష్ట్రంలో మరీ తక్కువ. అలాంటి అరుదైన బౌద్ధారామం ఒకటి ప్రకాశం జిల్లాలో ఉంది. 1965లో పురావస్తు శాఖవారు నిర్వహించిన తవ్వకాల్లో ఇక్కడ బౌద్ధ స్థూపం బయటపడింది. ఈ చందవరం స్థూపం క్రీస్తుశకం ఒకటి లేదా రెండు శతాబ్దాల నాటిదని తెలుస్తోంది. ఈ స్థూపం లభ్యమైన తర్వాత నాలుగుసార్లుగా తవ్వకాలు సాగించారు. ఆ తవ్వకాల్లో 15 పెద్ద స్థూపాలు, వందలాది చిన్న స్థూపాలు దొరికాయి.

 

చందవరం బౌద్ధ స్థూపానికి ఉత్తరాన ఉన్న ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుని పాలరాతి శిల్పం ప్రతిష్ఠించి ఉంది. బౌద్ధుల పగోడాను తలపించే నిర్మాణపు పునాదులు ఇక్కడ లభించాయి.

 

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరంలో ఉన్న బౌద్ధారామం ప్రసిద్ధి గాంచింది. వెల్లంపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న ఈ చందవరం బౌద్ధారామం చాలా పురాతనమైంది.

 

చందవరం బౌద్ధ స్థూపం ఎత్తయిన కొండమీద ఉంది. ఈ స్థూపం నిడివి చాలా పెద్దది. 30 అడుగుల ఎత్తు, 120 అడుగుల చుట్టుకొలత కలిగివుంది. ప్రకాశం జిల్లా వాసులు దీన్ని చందవరం స్థూపం అంటూ వ్యవహరిస్తారు.

 

బౌద్ధమతం క్రమంగా క్షీణించడంతో ఇక్కడి బౌద్ధారామాలను కూలగొట్టి, లేదా కూలినవాటిలోని శిల్పాలు, రాళ్ళు, మట్టి మొదలైనవాటిని చందవరంలోనే ఉన్న మహాబలేశ్వర ఆలయ నిర్మాణానికి ఉపయోగించి ఉంటారని నిపుణుల అంచనా.

 

ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి ఈ అమూల్యమైన చందవరం బౌద్ధ స్థూపాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. టూరిస్టులను ఆకట్టుకునేందుకు ఇక్కడ

Chandavaram Buddha Stupa, Bouddha stupa at Gundlakamma river, Biggest stupa in andhra pradesh, chandavaram buddha stupa rivals sanchi stupa, chandavaram hill top stupa


More Punya Kshetralu