• Prev
  • Next
  • Mogudu Pellam Ugadi Pacchadi

    Mogudu Pellam Ugadi Pacchadi

    హల్లో కూర్చుని టీవీ చూస్తున్న భర్త దగ్గరికి ఉగాది పచ్చడి తీసుకొని వచ్చింది భార్య.

    " ఏవండీ...మీరు ఈ ఉగాది పచ్చడి తాగుతూ టీవీ చూడండి..నాకు కిచెన్ లో పనుంది

    " అని చెప్పి ఉగాది పచ్చడి తెచ్చిన గిన్నెను భర్తకు యిచ్చి వెళ్ళిపోయింది.

    గబుక్కున టీవీని కట్ చేసి వెంటనే ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు.

    " హలో పోలీస్ స్టేషన్ "

    " ......."

    " ఏమి లేదండి...ఇప్పుడు నేను ఉగాది పచ్చడి తిన్నాననుకోండి...అప్పుడు నేను చస్తే

    అది ఆత్మహత్య చేసుకున్నట్టా లేక మా ఆవిడ హత్య చేసినట్టా ? " అని అడిగాడు భర్త.

    " ...................."

    " థాంక్యూ సార్ " అని సంతోషంగా ఫోన్ పెట్టేసి పక్కకి తిరిగి చూశాడు.

    అక్కడ నిలబడి కోపంగా గుర్రుగా చూస్తున్న భార్య కనబడింది.

  • Prev
  • Next