Antera Bamardee 22

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

అంతేరా బామ్మర్దీ 22

అన్నపూర్ణమ్మ భయభయంగా భర్తవేపు చూస్తుంది.

రంగనాథం అటూ ఇటూ చూసి డైనింగ్ టేబుల్ని ఎత్తిపారేసి వీధిలోకి వెళ్ళిపోతున్నాడు.

అన్నపూర్ణమ్మ అల్లాడిపోతూ అడిగింది " అటేక్కడికండీ " అని.

రంగనాథం ఆగి అన్నాడు " అడక్కు ..నీ తమ్ముడు ఈ ఇల్లు ఖాళీ చేసిన తరువాత వస్తాను " అని.

" వీధిలోకి వెళ్తున్నారెమో చెప్పు తొడుక్కుని వెళ్ళండి " అన్నది అన్నపూర్ణమ్మ.

" అక్కర్లేదు ...చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో తారోడ్డు మీద ఇట్లా ఇట్లా మెల్లి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ తిరుగుతా " అన్నాడు రంగనాథం.

" అది కాదండీ " అన్నది అన్నపూర్ణమ్మ.

" మాటాడకు.మంటేత్తి పోతుంది నాకు " అని గబగబా బయటకు నడిచాడు రంగనాథం.

అతను వెళ్లిన వైపు చూస్తూ అన్నపూర్ణమ్మ " ఊ " అని నిట్టూర్చింది.

అదొక తారు రోడ్డు.

తీవ్రమైన ఎండ మాడు పగలగోడుతుండగా ఆ రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుస్తున్నాడు రంగనాథం. నిప్పుల్లో నడుస్తున్నట్టున్నా ఆహో ఓహో అని ఆనందంగా అనుకుంటూ మంటని ఓర్చుకుంటున్నాడు.

అతనికి ఎదురుగా వస్తున్న కృష్ణమూర్తి ఆ విడ్డూరం చూచి షాకు తిన్నాడు. అంచేత అల్లాడిపోతూ అడిగేడు.

" అయ్యయ్యే ఇంత ఎండలో తారు రోడ్డుమీద చెప్పులు లేకుండా నడుస్తున్నారేమిటి?"

అప్పుడు వెంటనే నడక ఆపి రోడ్డు మీద నిలబడి అంటున్నాడు రంగనాథం " నడిస్తే తప్పా? ఇట్లా నడవకూడదని రూలు ఏమైనా పెట్టరా ?"

" కాళ్ళు కాలడం లేదూ "

" ఊహు..లేదు...అయిసు అయిసు ముక్కల మీద నడుస్తున్నట్టు ఎంతో చల్లగా వుంది. ఆనందంగా వుంది. మాకు ఆనందం ఎక్కువైనప్పుడల్లా పాటలు కూడా వస్తాయి. నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటాం చూడండి " అని నడిరోడ్డు మీద డేన్స్ చేస్తూ ఏమి హాయిలే హలా అని పాడేడు.

అలా రెండంటే రెండే లైన్లు మాత్రమే పాడి అడిగేడు

. " ఇప్పుడు మీ కళ్ళు చలబడ్డాయా " అని.

కృష్ణమూర్తి తట్టుకోలేక అన్నాడు " చాల్లెండి! మొన్న కూడా ఇదే వరుస! పరిచయస్తుల కదా అని చెప్పుల్లేకుండా నడుస్తున్నారేమిటని బుద్ధిలేక అడిగాను. ఇంకెప్పుడైనా మిమ్ముల్ని పలకరిస్తే చెప్పుతో కొట్టండి " అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతున్నాడు.

వెళ్ళిపోతున్న కృష్ణమూర్తిని చూస్తూ రంకెలు వేస్తున్నాడు రంగనాథం.

" చెప్పుతో కొట్టాలట చెప్పుతో! చెప్పుతో కొట్టడానికి మా కాళ్ళకి చెప్పులేవు. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్తితి మాది. మాకు ఎందుకు ఉంటాయి చెప్పులూ! వుండవు! కాలిపోతే మా కాళ్లే కాలతాయి. మీ కాళ్ళు కావు గదా ! ఎండలో నల్లిలా మాదిపోతే మేమే మాడిపోతాం. మీరు కాదు కదా! వెళ్ళండి వెళ్ళండి " అని మరిచిపోయిన పాటని మళ్ళా మొదలు పెట్టేడు.

బాధని ఓర్చుకుంటూ ఆ పాటని ఆనందంగా పాడుకుంటూ నడుస్తున్నాడు.

ఏమి హాయిలే హలా...

ఓహో ఏమి హాయిలే హలా....

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో