హలో... రాంగ్ నెంబర్.! - 65

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 65

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

కారు డ్రైవ్ చేస్తూనే ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ వుంటే అతనికి షాలినిలో పెద్ద తప్పేమీ కనబడలేదు. అవసరానికి ఆమె తనని ఉపయోగించుకోవాలని అనుకుంది. ఇద్దరి మధ్యా అవసరం కామన్. అది డబ్బు కావచ్చు. సెక్స్ కావచ్చు. కానీ అతనికి నచ్చని విషయం ఒక్కటే.

షాలిని తనని ఎఫెక్షన్ అనే ముసుగుతో మోసం చేసింది. అంతకన్నా 'నాకు నీ డబ్బు అవసరం. నీకు నేను అవసరం..ఇద్దరం ఒకరి అవసరాలు మరొకరం ఎక్స్ చేంజ్ చేసుకుందాం' అన్నా బావుండేది.

అలా షాలిని చేయకపోవడమే అతడ్ని బాధించింది. ఇక అతను షాలినితో ఎటుంటి పరిస్థితిలోనూ సంబంధం పెట్టుకోడు.

*            *          *

డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ తో కారాపాడు. ఓ అమ్మాయి థమ్స్ అప్ సైన్ ని తలకిందులుగా చేసి చూపిస్తోంది. కారాపి ఏమిన్నట్టు చూసాడు.

"ఇఫ్ యూ డోంట్ మైండ్..కారులో వెళ్తూ మాట్లాడుకుందాం" అంది ఆ అమ్మాయి.

వయసు ఇరవై అయిదు ముప్పయి మధ్య వుంది. ఫారినర్ అని ఈజీగా తెలుస్తోంది. మంచి స్ట్రక్చర్.

"విత్ ప్లెజర్..." అంటూ కారు డోర్ ఓపెన్ చేసాడు. ఆ అమ్మాయి అతని పక్కనే కూచుంటూ "థాంక్యూ జెంటిల్ మెన్" అంది.

"థాంక్యూ వరకు ఓ.కె. జెంటిల్ మేన్ అన్న స్టేట్ మెంట్ వెనక్కి తీసుకోవాల్సి రావచ్చు" ఇంగ్లీషు లో చెప్పాడు శ్రీకర్.

"మీరు జెంటిల్ మేన్ కాదా?" ఆ అమ్మాయి విచిత్రంగా శ్రీకర్ వైపు చూసి అడిగింది.

"కావచ్చు. కాకపోవచ్చు..." అన్నాడు సమాధానాన్ని సందిగ్దావస్థలోకి మారుస్తూ.

"అయామ్ ష్యూర్. మీరు పక్కా జెంటిల్ మేన్. లేకపోతే, నేను జెంటిల్ మేన్ ని కాదని ఎందుకు చెప్పుకుంటారు"

"థాంక్యూ జెంటిల్ ఉమెన్." అన్నాడు శ్రీకర్.

ఆ అమ్మాయి కుడిచేతిని చాచి "నైస్ మీటింగ్ టు యు" అంది.

శ్రీకర్ తన కుడిచేతిని చాచి, ఆమె చేతిని మృదువుగా నొక్కి వదిలాడు.

"థాంక్యూ" అంది ఆ అమ్మాయి.

"ఎందుకు?"

"మగవాళ్ళు అమ్మాయి చేతిని గట్టిగా నొక్కి వదిలితే విపరీతమైన కోరిక మాత్రమే వుందని అర్థం. అమ్మాయి చేతిని తన చేతిలోకి తీసుకొని పెదవుల దగ్గరకి తీసుకుంటూ, మనం పెళ్ళి చేసుకుందామా అని అంటే..నేను నీ ప్రేమ లోతులో దిగిపోయానని అర్థం. ఇలా మీలా మృదువుగా నొక్కి వదిలితే..నిన్ను అపురూపంగా చూసుకుంటానని చెప్పినట్లు అర్థం..ఇలా అమ్మాయి చేతిని మృదువుగా నొక్కి వదిలే మగాడు..అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించగలడు."

"ఆమె ఎనాలసిస్ అతనికి బాగా నచ్చింది.

"ఇదంతా ఎక్కడ చదివారు?" అడిగాడు ఇంగ్లీషులోనే శ్రీకర్.

"లైఫ్ లో..." అంది అతనికి మరికాస్త దగ్గరగా జరుగుతూ. అయితే ఆ కారులో సీట్లు విదివిద్గా వుండడం వల్ల పూర్తిగా ఆమె ప్రయత్నం సాధ్యపడలేదు.

"నాకు అంబాసిడర్ కారు బాగా నచ్చుతుంది" అంది ఆ అమ్మాయి.

"ఎందుకని?"

"ఒకే లాంగ్ సీట్ వుంటుంది. ప్రయివసీ వుంటుంది. మీకో విషయం తెలుసా..లాంగ్ సీట్ సింగిల్ బెడ్ లా కూడా పనికి వస్తుంది" ఆమె మాటల్లో తడబాటు లేదు. చాలా క్యాజువల్ గా మాట్లాడుతోంది.

"ఇంతకూ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పనే లేదు." అడిగాడు డ్రైవ్ చేస్తూనే శ్రీకర్.

"నిజం చెప్పాలంటే...మీతో యిప్పుడు ఏదైనా హోటల్ కు వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేయాలని వుంది. మీరు ఫ్రీ అయితే..."

శ్రీకర్ కారుని తాజ్ వైపు టర్న్ చేసాడు. ఆ కారు వెనకే జేమ్స్ బాండ్ బైక్ ఫాలో అవుతోంది.

*           *           *