హలో... రాంగ్ నెంబర్.! - 73

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 73

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

ఇరవై ఎనిమిదేళ్ళ స్టెలీనా చాలా అందంగా వుంటుంది. ఆమెకు చాలామంది మగవాళ్ళతో పరిచయాలున్నాయి. అయితే ఆ పరిచయాలను ఆమె ఎప్పుడూ బెడ్ రూమ్ వైపు తీసుకురాలేదు.

'మగవాళ్ళ పరిచయాలను హాలు బయట చెప్పులు వదిలేసి వచ్చినట్టు, మనసు బయటే వదిలివేయాలి' అన్నది ఆమె పాలసీ.

ఓ కార్పరేట్ ఆఫీసులో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేసే స్టెలీనాకు వృత్తిరీత్యా పరిచయం అయ్యాడు శ్రీకర్. వృత్తినీ, వ్యక్తిగత విషయాలను రెండు కోణాలుగా భావించే శ్రీకర్ తో పరిచయం స్టెలీనాకు విచిత్రమైన అనుభవాన్ని మిగిల్చి, ఆ అనుభవం ఎన్నో అనుభూతులను చిగురింపజేసింది.

సింగపూర్ నుంచి శ్రీకర్ తన బర్త్ దే గిఫ్ట్ గా అందించిన రొమాంటిక్ ఫామ్ బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఆలోచిస్తోంది. శ్రీకర్ తో పరిచయం గుర్తొచ్చింది స్టెలీనాకు. ఆరోజు తనకు బాగా గుర్తు. ఇంకా ఆ సంఘటన కళ్ళ ముందు కనిపిస్తూ గుండెలోనే వుంది.

*          *             *

"ఎక్స్ క్యూజ్ మీ...."

తలెత్తి చూసింది స్టెలీనా, ఎదురుగా ఓ అపరిచిత వ్యక్తి చిర్నవ్వుతో నిలబడి వున్నాడు.

"యస్.." అంది ఒక్కక్షణం అతని చూపుల నుంచి తప్పించుకుంటూ, తన ఫీలింగ్స్ కవర్ చేసుకొని.

"అయామ్ శ్రీకర్" అంటూ జేబులో నుంచి విజిటింగ్ కార్డు చూసి "మీరా...ఎట్ యువర్ సర్వీస్ గురించి వినడమే కానీ ఆ కంపెనీ చైర్మన్ ని ఇలా ప్రత్యక్షంగా చూస్తానని అనుకోలేదు." అంది ఆనందంతో చేయిచాచి.

"గ్లాడ్ టు మీట్ యు" అన్నాడు ఆమె చేతిని సున్నితంగా నొక్కి వదిలి. స్టెలీనాకు ఉద్వేగంగా వుంది. అతని గురించి కథలు కథలుగా విన్నది. అతను హ్యాండ్ సమ్ అని, డిఫరెంట్ పర్సనాలిటీ అని, వృత్తిలో డెడికేటెడ్ అనీ...ఇవన్నీ కాకుండా అతనికి బోల్డుమంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని...వీటిలో ఏది నిజమో తెలియదు.

బ్లూ జీన్స్, వైట్ రౌండ్ నెక్ టీ షర్ట్....చేతికి బ్రాస్ లెట్, ఎడమ చేతి మధ్యవేలికి రింగ్...చాలా సింపుల్ గా వున్నాడు. మొహంలో ఆకర్షణ...చిర్నవ్వులో మాగ్నటిక్ పవర్ వున్నట్టు అనిపిచింది.

ఇవన్నీ తన ఫీలింగ్సేనా? ఎదుటి వ్యక్తి గురించి తను విని వున్న విషయాల వల్ల తన మైండ్ అలా సెట్ అయ్యిందా?

"హ..లో...మీకు ప్లాష్ బ్యాక్ ల్లోకి కానీ, ఫాస్ట్ ఫార్వార్డుల్లోకి కానీ వెళ్ళే అలవాటుందా?" శ్రీకర్ అడగడంతో కొద్దిగా సిగ్గుపడింది స్టెలీనా.

"సారీ...ఇంతకూ మీరొచ్చినపని?"

"మీ బాస్ ని కలవాలి. అపాయింట్ మెంట్ అక్కర్లేదు. ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు"

"అలాగా...మీలాంటివారికి అపాయింట్ మెంట్ అక్కర్లేదు. కానీ మా బాస్ చెన్నయ్ వెళ్ళారు...మీరు ఒక్క ఫోన్ కాల్ చేసివుంటే ఇంతదూరం వచ్చే శ్రమ తప్పేది"

"నిజమే...నేను మీ ఆఫీసు పక్కనే వున్న రెస్టారెంట్ కు రాకపోయివుంటే, ఆఫీసు పక్కనే కదా ఫోన్ కాలేందుకు వేస్ట్ అనే ఫీలింగ్ నాక్కలిగి వుండేది. అప్పుడు ఫోన్ చేసి వచ్చి వుండేవాడిని"

"ఓహ్..నా వుద్దేశం మీరు ప్రత్యేకంగా వచ్చారేమో అని."

"అయితే ....మీ బాస్ ని కలిసే అవకాశం లేదన్న మాట. ఇన్ ఫాక్ట్ ఓ ఫ్రెండ్ తో లంచ్ చేద్దామని వచ్చాను. తీరా వచ్చేక, ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పాడు. సరే మీ బాస్  వుంటే కలిసి లంచ్ కు ఇన్వయిట్ చేయొచ్చు కదా...' మనసులో అనుకుంది స్టెలీనా.

"పోనీ మీరు లంచ్ తో నాకు కంపెనీ ఇవ్వగలరా?" శ్రీకర్ అడగడంతో ఉలిక్కిపడింది స్టెలీనా.

కొంపదీసి ఈ మనిషికి ఫేస్ రీడింగ్ తెలియదు కదా!

"నాకు ఫేస్ రీడింగ్ తెలియదు. కానీ హార్ట్ ఫీలింగ్స్ తెలుసు. నాతో రెస్టారెంట్ లో లంచ్ చేయడం మీకు అభ్యంతరం లేకపోతే....వెల్ కమ్..."

ఏం చెప్పాలో తెలియడం లేదు స్టెలీనాకు. ఎక్కడో చదివింది. కొందరికి వశీకరణ విద్య తెలుసనని. కొందరి సమక్షంలో మనం ఏం చెప్పినా వింటాం. మంత్ర ముగ్డులం అయిపోతాం. ఇప్పుడు తను అదే పరిస్థితిలో వుందా?"

"షల్  వుయ్ మేకే మూవ్" అన్నాడు శ్రీకర్. హిప్నటైజ్ చేయబడినట్టు లేచింది స్టెలీనా.

*            *          *