TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 29
ముచ్చర్ల రజనీ శకుంతల
హలో..రాంగ్..నెంబర్..!
ఇక్కడ జేమ్స్ బాండ్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి.
అతడి మీద జేమ్స్ బాండ్ సినిమాల ప్రభావం చాలా వుంది. ఎప్పటికైనా జేమ్స్ బాండ్ కావాలన్నది అతని ఆశయం. చిన్నప్పట్నుంచీ అతనికి డిటెక్టివ్ పుస్తక మల్లా అది ఏ భాషలో వచ్చినా చదివేవాడు లేదా చదివేందుకు ప్రయత్నించేవాడు. అతని అసలు పేరు చరణ్. తనకు లానే జేమ్స్ బాండ్ గా మార్చుకున్నాడు.
డిటెక్టివ్ ఏజెన్సీల చుట్టూ తిరిగాడు లక్కీగా నాయర్ కళ్ళలో పడ్డాడు. నాయర్ జేమ్స్ బాండ్ లోని చురుకుదనాన్ని, సిన్సియారిటీని గుర్తించాడు. మొదట్లో చిన్న చిన్న అస్సయిన్ మెంట్లు అప్పగించాడు. పర్ ఫెక్ట్ గా పూర్తిచేసాడు. మర్డర్ మిస్టరీ కేసుల్లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.
చెప్పిన పనిని సిన్సియర్ గా చేయడం, విషయాన్ని కాన్ఫిడెన్షియల్ గా వుంచడం, వృత్తిపట్ల అంకిత భావం ఇవ్వన్నీ చూసి నాయర్ అతనికిష్టమైన జేమ్స్ బాండ్ పేరును ఖరారు చేసాడు. చిన్న చిన్న వీక్నెస్ లు మినహాయిస్తే మంచి సమర్డుడే జేమ్స్ బాండ్.
ఇంకా పెళ్ళికాని ఇరవై ఆరేళ్ళ జేమ్స్ బాండ్ కు వెనకా, ముందూ ఎవరూ లేరు. టేకిటీజీ పాలసీ అతనిది. అతనికి వున్న వీక్నెస్ తినడమే.
జేమ్స్ బాండ్ ఆ క్షణమే నాయర్ అప్పగించిన అస్సయిన్ మెంట్ మొదలు పెట్టాడు.
* * *
"ఏయ్ అక్షితా ! ఇన్నాళ్ళూ ఇంతందం ఎక్కడ దాచావు" ఆమె తెల్లటి పొట్ట మీద తన కుడిచేత్తో సుతారంగా రాస్తూ అడిగాడు.
"మీలాంటి గ్రీకువీరుడి కోసం బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసాను."
"నిజం చెప్పనా...డెడ్ బాడీని సహితం బెడ్ మీదికి రప్పించే స్ట్రక్చర్ నీది..."
"ముప్పయి రెండు..." అంది అక్షిత.
"ఏంటీ" అడిగాడు శ్రీకర్.
"మీరిలా చెప్పడం...ప్రతీసారి మీరిలానే చెబుతారు...అమ్మాయిలందరితోనూ ఇలానే చెబుతారా/"
"ఛ...ఛ...సముద్రాన్ని చూసినా, ఆకాశాన్ని చూసినా, ప్రకృతిని చూసినా, నిన్ను చూసినా నాకిలాంటి ప్లజెంట్ మూడ్ వస్తుంది" ఆమె నాభి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
ఆమె మాట్లాడలేదు. అతన్ని దగ్గరకు లాక్కుంది.
* * *
అప్పుడే మన పరిచయమై ముప్పయి రోజులు దాటిందంటే ఆశ్చర్యంగా వుంది. ముప్పయి రోజులు ముప్పయి క్షణాల్లా గడిచియాయి కదూ..." శ్రీకర్ అన్నాడు.
"కాదు..ఇరవై నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి."
"అదేంటి! సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేములున్నట్టు" శ్రీకర్ ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును...మొదటి ఆరురోజులు మన పరిచయం డెవలప్ అవ్వడానికే ఖర్చయ్యాయి. అప్పుడు క్షణమొక యుగంగా అనిపించింది. మీరు నన్ను 'ట్రాప్' లో పడేసింది ఆరవరోజే కదా..."
"ట్రాప్ లోనా?"
"అదే మీ ప్రేమ ట్రాప్ లో మీ గుండె ట్రాప్ లో" సర్ది, సవరించి చెప్పింది అక్షిత.
"అక్షితా ! యూ ఆర్ టూ క్లెవర్...టూ స్మార్ట్..."
"థాంక్యూ...." అంది అతని భుజం మీద తల పెట్టి.
"నేనింక వెళ్ళేదా?"
"అప్పుడేనా...రాత్రి పదకొండే కదా అయింది."
"వెళ్ళాలి. మా ఆవిడ నాకోసం కాచుక్కూచుంటుంది. ఆలస్యమైందని కాల్చుకు తినడానికి" నవ్వుతూ చెప్పాడు శ్రీకర్.
"మీరు భలే ఫన్నీగా మాట్లాడతారు" అంది అక్షిత.
శ్రీకర్ చిన్నగా నవ్వి, టేబుల్ మీద వున్న నెక్లెస్ సెట్ బాక్స్ తీసి అక్షిత చేతికి ఇచ్చి చెప్పాడు.
"స్మాల్ గిఫ్ట్ ఫర్ యు"
"ఓహ్....మార్వలెస్...వెంటాస్టిక్" అంది బాక్స్ లో నుంచి నెక్లస్ సెట్ తీసి చూసి.
"నీ మెడలో ఇంకా అందంగా వుంటుంది" అన్నాడు ఆమెవైపే చూస్తూ.
"మీరే అలంకరించొచ్చుగా" అంది అక్షిత.
"ఒంటిమీద వున్న అచ్చాదనా అలంకారాలను తీయడం మీద వున్న ఇంట్రెస్ట్, తొడగడం మీద వుండదు. దట్స్ మై వీక్నెస్" అన్నాడు శ్రీకర్.
అక్షిత నవ్వి పాదాలను పైకి లేపి, వ్రేళ్ళ మీద నిలబడి శ్రీకర్ పెదవుల మీద ముద్దుపెట్టుకుంది.
శ్రీకర్ అలానే ఆమె నడుం మీద చేయేసి మరింత కాస్త దగ్గరకు లాక్కున్నాడు. ఒక్కక్షణం ఫైర్ ప్లేస్ ముందున్న ఫీలింగ్ కలిగింది.
* * *
శ్రీకర్ ఇంటికి వచ్చేసరికి గేటు దగ్గర వాచ్ మేన్ కునికిపాట్లు పడుతున్నాడూ. కారు హారన్ శబ్దం విని ఉలిక్కిపడి లేచి గేటు తీసాడు.
శ్రీకర్ కారు లోపలికి వెళ్ళింది. వాచ్ మేన్ గేటు వేసి స్టూలు మీద కూచొని మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
దాదాపు రెండు గంటల నుంచీ అక్కడే తచ్చట్లాడుతున్న జేమ్స్ బాండ్ శ్రీకర్ కారు నెంబర్ నోట్ చేసుకున్నాడు. అతను ఎటువైపు నుంచి వచ్చాడో గుర్తించుకున్నాడు. ఆఫీసునుంచి వచ్చివుంటే రైట్ నుంచి రావాలి. కానీ శ్రీకర్ వచ్చింది లెఫ్ట్ నుంచి...అంటే ఆఫీసు నుంచి కాదు...అతని కోటు జేబులో కాస్ట్ లీ కాల్ గాళ్స్ లిస్ట్ వుంది.
వాట్ నెక్స్ ట్ అన్నది.
|