Bujjigaadi Telivi

“ మమ్మీ..మమ్మీ...నేను రేపటి నుండి స్కూల్ కి వెళ్ళను. మా టీచర్స్ కు ఏమి తెలియదు.

పాఠాలు ఒకసారి ఒకలాగా, ఇంకోసారి మరొకలాగ చెబుతున్నారు " అని చంకనున్న

స్కూల్ బేగ్ మూలకు విసిరేస్తూ అన్నాడు బుజ్జిగాడు.

“ అలాగా...! ఇంతకూ మీ టీచర్స్ ఏం చెప్పారు ?” అని బుజ్జిగాడిని బుజ్జగిస్తూ అడిగింది తల్లి.

“ నిన్న మా తెలుగు మాస్టార్ వచ్చి రాజీవ్ గాంధీ నెహ్రు గారి మనవడు అని చెప్పారు. ఈ

రోజేమో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకు అని చెప్పారు.లెక్కల మాస్టారేమో నిన్న ఐదు

ఐదు పదన్నారు.ఈ రోజు మళ్ళీ ఏడు మూడు పదంటున్నారు " అని చెప్పాడు బుజ్జిగాడు.

అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఆ తల్లి.