Home » Dwadasha Rasulu Karakatwalu » మకరరాశి
మకరరాశి

సరిరాశి - చరరాశి మరియు భూతత్త్వరాశి - ఈ రాశిగుర్తు మొసలి. శరీరము జింకముఖము కలిగిన చిత్రమైన జంతువు ఇందు మొసలి గట్టి పట్టుదలను, జింక సున్నితత్వమును తెలియజేయును.

 

ఈ రాశిలో జన్మించిన వారికి జాగరూకత, గట్టిపట్టు, అవకాశమును జారవిడువకుండుట ముఖ్య లక్షణములు. కనుక వీరి జీవితమునకు నిర్ధిస్టమైన కార్య సాధన, చక్కని వినియోగములున్నవి. అర్థముగాని ఏ విషయమును వీరు అంగీకరించరు. దేనినైన, సూక్ష్మ పరిశీలన చేసి, గుట్టు మట్టులను చక్కగా అర్థము చేసికొని తగిన బుద్ధి కుశలతతో ప్రవర్తింతురు. ఎదుటివాని లోతుపాతులను గమనించి, యుక్తితో ఎటువంటి కార్యమునైనను సాధించగలరు.  వారిది ఆచరణ ప్రధానమైన జీవితము.

 

వీరిలో జింకవంటి ఆకర్షణ యున్నది, వీరినిచూసి, ముచ్చటపడి ఎవ్వరైననూ, ఏ పనైననూ చేసిపెట్టుదురు. వీరు స్వార్థమును ఉపయోగించిన కూడా ఇతరులు వీరి కార్యసాధనకై పాటుపడుట ఆశ్చర్యము. వీరు స్వార్థమును తగ్గించుకొనినచో, వీరి తెలివితేటలు, పలుకుబడి, సామర్థ్యం మానవజాతికి అమూల్యముగా పనిచేయును.

 

ఊహాగానము వీరికేరంగమునందు నచ్చని విషయం. వీరి తెలివితేటలు వీరి జాగరూకతతో బంధింపబడి యుండును. ఎవరినీ నమ్ముట వీరి జాతకమున ఉండదు. కానీ అందరినీ నమ్మునట్లు మాత్రం వ్యవహరించగలరు. అట్లు ఇతరులను నమ్మించగలరు. ఉదా. (భార్య) పుత్రాదుల విషయమున కూడా వీరిట్లే ప్రవర్తించుట గమనించవలసిన విషయం. ఈ కారణం వలననే వీరు వ్యవహారములలో, లోకధర్మములో ఎన్నడునూ పై చేయిగా నుందురు. వీరిని వెంటాడి వేధించునది ఒంటరి తనమే. దీనికి కారణము ఎవరిపైననూ వీరికి ఆత్మీయలు, ఆపేక్షలు, అభిమానము లేకపోవుట, మనస్సు నందెవ్వరికీ చోటివ్వకపోవుట.

 

వీరు సామాన్య విషయాలలో కూడా నిరంతరం శ్రమ చేయగలరు. ఇతరులు సామాన్య విషయాలను అశ్రద్ధ చేయునవి వీరికి ఆరాధ్య విషయాలు. వీరు కవులైనచో రచనా సౌందర్యమునకు, శబ్దార్ధములకు తప్పులు లేకపోవుటకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చెదరు. వీరికి ఏ కళలోనైనా వాస్తవికత ఎక్కువ, కల్పన, ఊహలు తక్కువ. దర్శనజ్ఞానం కన్న వీరికి తర్కపటుత్వమెక్కువ. వీరికి చురుకుదనముకన్న, నిదానము; తొందరపాటుకన్న క్రమవర్తనము ఎక్కువ, ఏ పనిని సగం చేసి విడిచి పెట్టుట యుండదు. ఈ విషయంలో కొందరు వీరిని చాదస్తులుగా అనుకున్నను వీరు లెక్క చేయరు. వీరి విజయమునకు ఇదే కారణం.

 

వీరి జాగరూకత అనుమానముగా, విమర్శ తప్పులు ఎత్తి చూపుటకు, తార్కిక శక్తి దేనిని నమ్మకపోవుటకు పరిణమించకుండ వీరు జాగరూకత వహించవలసి యున్నది. వీరి లౌక్యము మోసము, దగాలకు దారితీసినచో ఇతరులు గమనించలేరు. కాని వీరు నైతికముగా పతనమగు అవకాశము కలదు. స్వప్రయత్నమున సాటివారిని అధిగమించగలరు. వేరు కర్తవ్య నిర్వహణలో హృదయ్ముం దయలేనివారుగా, క్రూరులుగా కనిపింతురు. కాని వీరికి కర్తవ్య నిర్వహణ ముఖ్యము. ఇతరుల అభిప్రాయము తరువాత, జీవితమున వీరికి ఎక్కువ మార్పులు నచ్చవు. స్థిరముగా ఒక మార్గమున అభ్యాస పాటవముతో పరిసర వ్యక్తులను మించగలరు. సమస్యలను పరిష్కరించుటలో వీరి తరువాతనే ఎవ్వరైననూ, ఈ స్వభావముననుసరించి, స్థిరమైన మార్పులేనిపనులు ప్రణాళికలు వీరు అలవరుచుకొనుట చాలా అవసరము. మార్పులేని వృత్తులలో ఉద్యోగం వీరికి జయప్రదం, స్వతంత్ర వృత్తులలో ఒక్క న్యాయవాద వృత్తి తప్ప మిగిలినవేవీ కూడా మంచివి మరియు శుభకరము కాదు. పేరులకు సంబంధించిన వృత్తులు, పురపాలక సంఘములు, పంచాయితీ, రాయబారశాఖ, రెవిన్యూ, వ్రాత పూర్వక అధికారము గల ఉద్యోగములు వీరికి అనుకూలము లలితకళలు ఎట్టి పరిస్థితులలోనూ జీవనోపాధిగా రాణించవు, అసహాయత, వ్యక్తిగత నిర్భయము, సాహసము కావలసిన వృత్తులు వీరికి మంచివి కాదు, మరియు రాణింపు ఉండదు. వీరికి కామజీవితమూ అప్రధానం, ప్రేమవివాహాలకు వీరు చాలా దూరం, ఇతర సదుపాయములు, లాభములు, వినియోగ దృష్టి ననుసరించి వీరు వివాహమును తమ కనుకూలంగానే చేసుకొందురు. ఈరాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనపైసందేహముండును. భర్త విషయములోకూడా ఇదే విధముగా ప్రవర్తించి కుటుంబ సౌఖ్యమును దూరము చేసుకొను అవకాశమున్నది. జ్వరబాధలు, రక్తప్రసార దోషములు, రక్తనాళాముల వ్యాధులు కలుగుచుండును. నడివయస్సునుండి మోకాళ్ళు దుర్భలమగును. అతిశ్రమ వలన నరముల బలహీనత, నిద్ర తక్కువతో కీళ్ళనొప్పుల్లు, ఆహారము, అశ్రద్ధ చేయుటతో జీర్ణాశయ ఆమ్లత, కృశరోగము కలుగగలదు.

 

వీరి జీవితమంతా కష్టార్జితముపై ఆధారపడి యుండును. కొంతకాలం పేదరికము తప్పనిసరి కాగలదు. ఆకస్మిక ధనాగమాములు వీరికుండవు. వయస్సి పెరిగిన కొలది, ఆర్థికముగా, సాంఘికముగా లభించును స్థిరాస్తులెక్కువ. ఇల్లు, భూవసతి, లారీలు, ఫ్యాక్టరీలు గనులు, వ్యవసాయగ్రామములు, పల్లెలలో వీరికి సుఖము కలుగును. వీరికి 30 సంవత్సరముల వరకు ఆర్ధిక సంపత్తి చేకూరదని చెప్పవచ్చును.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.