ENGLISH | TELUGU  
Home  » 

రామ్ గోపాల వర్మ

on Feb 2, 2011

విలక్షణ శైలితో సినిమాలు తీస్తూ,తన సినిమాలంటేనే ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తిని కలిగించే విధంగా పబ్లిసిటీని చేసే వివాదాస్పద, సంచలన దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ గురించి అందరికీ తెలిసిందే.తన తొలి చిత్రం"శివ" నుంచీ నిన్నటి "రక్తచరిత్ర" వరకూ అన్నీ సినిమాలూ సంచలనమే.అవి హిట్టయినా ఫ్లాపయినా సరే ప్రేక్షకుల మధ్య చర్చగా మాట్లాడుకునే టాపిక్ ని ఇస్తాయి.అది అతను ఎన్నుకునే కథ కావచ్చు...ఆ సినిమా తీసే విధానం కావచ్చు...ఆ సినిమా కోసమ అతను ఎన్నుకునే ప్రచార శైలి కావచ్చు..అన్నీ ఆసక్తిని కలిగించే విధంగా ఉంటాయి.అతని దర్శకత్వంలో వచ్చిన ప్రతి చిత్రం ఆ విషయాన్ని రుజువు చేస్తుంది.ప్రపంచం ఏమనుకుంటుంది అనే స్థాయి నుంచి అతనేనాడో దాటిపోయాడు.తానేమనుకుంటున్నాడో అది చేయటమనే స్థితికి వర్మ చేరుకున్నాడు.తాను తీసిన సినిమాల ఫలితాల గురించి గానీ, డబ్బు గురించి గాని వర్మ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఒక కర్మ యోగిలా వర్మ తనపని తాను చేసుకుంటూపోతాడు.అతన్ని కొందరు అహంభావి అనుకుంటారు.కొందరు అతనికి బాగా పొగరనుకుమటారు.మరి కొందరు మేధావి అనుకుంటారు.ఇంకొందరు పిచ్చోడనుకుంటారు.ఎవరేమనుకున్నా తానేంటో స్పష్టత కలిగిన వ్యక్తి రామ్ గోపాల వర్మతో తెలుగువన్ ముఖా ముఖి మీకోసం.

తెలుగువన్ - వర్మ గారూ మీగురించి మీరేమనుకుంటారు....?

వర్మ - ఏమీ అనుకోటానికి ఏం చేశామనీ...ఏం సాధించామని అనుకోమంటారు....?

తెలుగువన్ - మీకు పబ్లిసిటీ పిచ్చని కొందరు అనుకుంటూంటారు.దీనికి మీ సమాధానం...?

వర్మ - అప్పుడే పుట్టిన బిడ్డ తనకు పాలు కావాలని ఏడుస్తూంది.ఎందుకని...? మౌనంగా ఉంటే తన ఆకలి అమ్మకు తెలియదని.పబ్లిసిటీ అనేది మనిషి జీవితంలో అప్పటి నుంచే మొదలవుతుంది.పసి పాపే తన ఆకలి తెలపటానికి పబ్లిసిటీ ఇస్తూంటే...కోట్లతో సినిమా వ్యాపారం చేసే నేను నా సినిమా కోసం ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోవటం తప్పేం కాదుగా......?

తెలుగువన్ - మీరు అయిదు రోజుల్లో ఒక కమర్షియల్‍ సినిమా చేస్తానంటున్నారు...అది కూడా పైసా ఖర్చులేకుండా...? అదెలా సాధ్యం...?

వర్మ - ఎందుకు సాధ్యం కాదు...? హ్యాపీగా చెయ్యొచ్చు.అంతా ప్లానింగ్ లో ఉంది.

తెలుగువన్ - ఈ చిత్రం పేరేంటి...?

వర్మ - "దొంగల ముఠా" ఎలా ఉంది...?

తెలుగువన్ - ఈ చిత్రం గురించి చెప్పండి...?

వర్మ - ఈ సినిమాలో రవితేజ హీరో, ఛార్మి హీరోయిన్, మంచు లక్ష్మీ ప్రసన్న ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం,బ్రహ్మాజీ, సుబ్బరాజు, అజయ్ తదితరులు నటిస్తారు.

తెలుగువన్ - సాంకేతిక నిపుణులెవరెవరు పనిచేస్తారు...?

వర్మ - చాలా తక్కువమంది పనిచేస్తారు.

తెలుగువన్ - ఈ చిత్రానికి ఎటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు....?

వర్మ - లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తాం.

తెలుగువన్ - ఒక వేళ అది వికటిస్తే...!

వర్మ - నేను "శివ" సినిమాకి స్టడీ కామ్ వాడినప్పుడు కూడా చాలా మందికి ఇలాంటి అనుమానాలెన్నో వచ్చాయి.భయపడితే ఏమీ చేయలేం. నేను అప్పుడూ కొత్తదనాన్ని అడాప్ట్ చేసుకున్నాను.ఇప్పుడూ కొత్త టెక్నాలజీని వాడుకుంటాను.

తెలుగువన్ - ఈ చిత్రం కథ ఏమిటి...?

వర్మ - మీరే చూస్తారుగా...తినబోతూ రుచెందుకు అడగటం...?

తెలుగువన్ - ఈ సినిమాకి పెద్ద దర్శకులు పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ, వినాయక్, హరిష్ శంకర్ వంటి వారంతా సహాయకులుగా పనిచేస్తారని విన్నాం..నిజమేనా....?

వర్మ - మీకు ఎవరు చెప్పారు...?

తెలుగువన్ - అలాగని సినీ జనం అనుకుంటున్నారు...

వర్మ - పనీ పాట లేని వాళ్ళు లక్షనుకుంటారు.అవన్నీ నమ్మేస్తారా....?

తెలుగువన్ - పోనీ మీరు చెప్పండి...అది నిజమేనా...?

వర్మ - చెప్పే సమయం వచ్చినప్పుడు...ఎలా చెప్పాలో...ఎవరు చెప్పాలో...ఎక్కడ చెప్పాలో అలా చెపుతారు.తొందరెందుకు

తెలుగువన్ - సరే భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాల గురించి చెపుతారా...?

వర్మ - దొంగల ముఠా తర్వాత బెజవాడ రౌడీలు, దాని తర్వాత డిపార్ట్ మెంట్‍, ఆ తర్వాత "అమ్మ" నా ఫ్యూచర్ ప్రోజెక్టులు.

తెలుగువన్ - వర్మ "అమ్మ" అనే సెంటిమెంట్‍ సినిమా తీయటమా ...?

వర్మ - "అమ్మ" అనగానే సెంటిమెంట్ సినిమా అని మీకు మీరే తీర్మానించుకుంటే అది నా తప్పా...? అసలు అది సెంటిమెంట్ సినిమా అని నేను చెప్పానా...?

తెలుగువన్ - మరి "అమ్మ" అనగానే ఎవరికైనా అదే ఊహ వస్తుంది.

వర్మ - కానీ ఈ "అమ్మ" మీరంతా అనుకునే అమ్మ కాదు."రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్"లాగా ఇదొక యాక్షన్ బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. తెలుగువన్ - చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.ఈ చిత్రం కథ గురించి చెపుతారా...?

వర్మ - ఇటీజ్ టూ ఎర్లీ టు టాక్ ఎబౌట్‍ దిస్ టాపిక్.ఒ.కె.బై. తెలుగువన్ - ఒ.కె. థాంక్యూ అండ్ బై...


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.