ఆదర్శ దాంపత్యం

 


హైస్కూల్ నుండి నిన్నటి వరకూ
తన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పేసిన
జెనూఇన్ హస్బండ్ ట్రూత్ ఫుల్నెస్ తో
మొదలయిన మీ ఫస్ట్ నైట్ సాక్షిగా
నీది ఆదర్శ దాంపత్యమే

నిన్నారుగజాల చీరలో చుట్టేసి తను మాత్రం
అర్ధనగ్న భామల అందాలను ఆబగా చూ స్తూ
నాకేసిన నీ వంటకం రుచికి మెచ్చుకోలు
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే

ఆఫీస్ లో ఎ ఫైర్స్ ఉన్న సుందరాంగుల్ని
ఓపెన్ గా ఇంటికాహ్వానించినప్పుడు
అవమానాలను, అనుమానాలను కొంగుతోపాటు దోపేసి
చిరునవ్వులు చిందిస్తూ వారితో పరాచికాలాడిన
నీలో లోపలి (ఘోస్ట్) హోస్టెస్ అద్భుత ఆతిధ్యాల
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే

పదిమందిలో నీ అభిమానాన్ని దెబ్బ తీస్తూ
నిన్ను చిన్నబుచ్చినప్పుడు, కళ్ళలో తేలుతున్న
నీటి బుడగల్ని చప్పుడు లేండా పేల్చేసి
నీ ఎంసీపీ (MCP) హస్బండ్ ఆధిపత్యాన్ని
నవ్వుతూ అంగీకరించిన నీ నటనా చాతుర్యం
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే

పండగ ముందు రోజు రాత్రి పట్టు చీర
కొనిచ్చి, నిన్ను మురిపించి నీ కిష్టం లేకున్నా
బలవంతంగా నిన్ను మంచం మీదకి లాగినపుడు
నువ్వేవగించుకునే పడుపుగ త్తె జ్ఞాపకం
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే



అ త్తగారి ఆరళ్ళు, ఆడపడుచుల ఈసడింపులు
మామగారి వేధింపుల మధ్య నువు నలుగుతుంటే
తనకు మాత్రం అ త్తగారింట గౌరవ మర్యాదల్లో
లోపం ఉందని, నిన్ను పుట్టింటికి పంపక పోతే
ఈ జన్మ కింతేనని సరి పెట్టుకున్న నీ రాజీ మన స్తత్వం
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే

ఇక వల్లకాదని తెగింపు వచ్చిన ఒక బలహీన క్షణంలో
ఎదురు చెప్పినపుడు నీ చెంప ఫెడేల్మనిపించిన తర్వాత
అమ్మవారి బొమ్మ ముందు మోకరిల్లిన నీ పతి దైవభ క్తి
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే

తన సక్సెస్ లన్నిటికీ క్రెడిట్ ఇవ్వకపోయినా
తన పార్టీస్ కి, ఫంక్షన్స్ కీ నిన్ను వెంట తిప్పుకుంటూ
సహధర్మ చారిణిగా నీపట్ల పబ్లిక్ గా గౌరవం నటించే
నీ మొగుడు కోపంలో చూపే బూతు సంస్కారం
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే

నన్ను కాదంటే పూట తిండికి గతి లేదని నీ మొగుడు
ఈసడించినప్పుడల్లా స్వేచ్చగా బ్రతికే పక్కింటి డైవొర్సీ ని
సీక్రెట్ గా ఎడ్మైర్ చే స్తూ , నీ పట్టు చీరలు, నగలు ముందు
ఆమె సాదా సీదా జీవితం వెలా తెలా అనుకునే నీ హిపొక్రసి
సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే

గృహిణిగా, తల్లిగా నీ క ర్తవ్య నిర్వహణ కోసం
నువు చంపుకున్న నీ కళలు, నీ అభిరుచులు,
పెట్రియార్కల్ ఇన్సెన్సిటివిటీస్ పుణికి పుచ్చుకున్న
నీ సుపుత్రులు నీ పట్ల చూపే అవసరార్ధ ప్రేమలు,
నిన్నొక డెపెండెంట్, సెంటిమెంటల్, ఇడియాటిక్ లూసర్ గా
నిలబెట్టినా, ఈ సమాజం నిన్నెపుడూ ఒక ఆదర్శ గృహిణిగానే గౌరవి స్తుంది
అవును నీది ఆదర్శ దాంపత్యమే, నువు ఆదర్శ గృహిణివే.

 

 

 

....శారద శివపురపు

Latest News
Cinema
Sahityam Special
Movies
Recipes
TeluguOne For Your Business
About TeluguOne