మానవుని పురుషాంగం ఒక విశిష్టమైన నిర్మాణం. దానిలోకి రక్తం రావడం కొంతసేపు ఉండడం, ఒత్తిడి పెరగడం, మళ్ళీ మామూలుగా అవ్వడం ఇలా అనేకసార్లు జీవితాంతం జరుగుతూ ఉంటుంది. ఈ మార్పులు కలిగినప్పుడు గట్టిగా ఉన్నప్పుడు గట్టిగా స్టెయిట్ గా ఉంచడం, మళ్ళీ మామూలు స్థితిలోకి రాగానే మామూలుగా అవ్వడం అంగంలోని కండరాలు, నిర్మాణంలోని ప్రత్యేకత. అంగస్తంభన కణజాలమైన కార్పరా చుట్టూ అనేక పొరలు ఉంటాయి. అంగస్తంభన కణజాలమైన కార్పరా చుట్టూ అనేక పొరలు ఉంటాయి. అంగస్తంభన కణజాలాన్ని కప్పుతూ ట్యూనికా ఆల్బుజీనియా ఉంటుంది. కార్పస్ స్పాంజియోజమ్ చుట్టూ గుండ్రంగా కాగితపు మందంలో పేషియా ఉంటుంది. కార్పరా కావర్నోజా రెండు లేయర్ల ట్యూనికా ఫేషియాతో కప్పబడుతుంది.
దీనిలో రెండురకాల కొలేజన్ బండిల్స్ ఉంటాయి. లోపల పొరలోని బండిల్స్ కావర్నస్ కణజాలానికి సపోర్ట్ నిస్తాయి. ఇవి గుండ్రంగా ఉంటాయి. లోపలి గుండ్రటి పొరల్లోంచి ఇంట్రా కావర్నోజల్ పిల్లర్స్ వచ్చి అంగస్తంభన కణజాలానికి సపోర్ట్ నిస్తాయి. పై పొరలోని బండిల్స్ లో గ్లాన్స్ పెన్నిస్ నుంచి ఈ పొరలుంటాయి. ఈ పొరట్యూనికా ఆల్బూజీనియా మందంలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. కొలాజిన్ బండిల్స్ లో కొలాజిన్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి సాగే గుణం కలిగి ఉండవు. కాకపోతే ఉక్కుకంటే దృఢమైనవి. ఈ కొలాజిన్ ఫైబర్స్ లో అనేక కొలాజిన్ ఫైబ్రిల్స్ మధ్యమధ్యలో అనేక ఎలాస్టిక్ ఫైబర్స్ తో కూడి ఉంటాయి. అంగస్తంభన తగ్గాక అంగం మళ్ళీ మామూలుగా అవ్వడానికి ఇవి దోహదపడతాయి. ఈ ఎలాస్టిక్ ఫైబర్ లు మామూలు పరిమాణానికి 150 శాతం ఎక్కువ పొడుగు సాగే గుణం కలిగి ఉంటాయి. ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుతో చూసినప్పుడు అనేక మైక్రో ఫైబ్రిల్స్ ఉంటాయి.
ఎంతమందిలో ఈ వ్యాధి ఉంటుంది?
ఇది అరుదైనది ఏమీకాదు. తెల్లవారిలో ఒక శాతం మందిలో చూడబడింది. సాధారణంగా 43-65 సంవత్సరాల మధ్యవారిలో కలుగుతుంది. యువకులలో కూడా అరుదేమీ కాదు. కొద్దిమంది నల్లవారిలో కూడా ఇది చూడబడింది. వారిలో చాలామందిలో మధుమేహవ్యాధి ఉండడం, అంగస్తంభన సమస్య కలగడం పిరోనిస్ డిసీజ్ వ్యాధి నిర్ధారణ అవ్వడానికి ముందే చూశారు. మన రాష్ట్రంలో కూడా ఇది అరుదేంకాదు. అనేకమంది యువకులలో మధ్య వయస్కులలో ఈ వ్యాధిని చూశారు. సుమారు 45,000 మందిని ఇప్పటిదాకా చికిత్సించిన వారి డేటాను విశ్లేషిస్తున్నా. ఖచ్చితమైన గణాంకాలు తరువాత తెలియజేస్తాను. పిరోనిస్ వ్యాధిని ప్లాస్టిక్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ ది పెన్నిస్ అని గానీ పినైల్ ఫైబ్రియాటోసిన్ అనిగానీ పిలుస్తారు. 1990 తరువాత కొరియాలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడం చూశారు.
1991లో మిన్నెసోటాలో జరిగిన ఒక రిపోర్ట్ లో ప్రతి లక్షమంది మగవారిలో 388.6 మందిలో ఈ వ్యాధి చూశారు. రుమటాయిడ్ ఆర్త్రయిటిస్ అంటే కీళ్ళ జబ్బు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ఇమ్యూన్ వ్యాధి గ్రస్తులలో ఇది ఉండడం చూశారు. 30-65 సంవత్సరాల మధ్య వయస్సుకల ఒక శాతం మందిలో ఈ వ్యాధి చూశారు. ఈ వ్యాధిగ్రస్తులలో 90 శాతం మంది 40-70 సంవత్సరాల మధ్యవయసు కలవారు. కాకపోతే టీనేజర్స్ లోనూ 80 ఏళ్ళు దాటిన వారిలో కూడా కొందరిలో ఈ వ్యాధి చూడబడింది. 1997లో ఎముకలకు సంబంధించిన ప్యాగెట్స్ వ్యాధి కలవారిలో 15శాతం మందిలో పిరోనిస్ వ్యాధి చూశారు.
దీనికి సంబంధించిన కారణాలను వచ్చే సంచికలో తెలుసుకుందాం ...
|
|


