మసాలా ఆవకాయ
ఇది ఒక రకం ఆవకాయ.. ఇందులో మసాలా రుచులు కలుస్తాయి మామిడి పిండికి. ఆవపిండి అస్సలు వేయరు. కొలతలు మీ రుచులు బట్టి మార్చుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
మామిడికాయ ముక్కలు - ఒక గిన్నెనిండుగా
పసుపు - 4 చెంచాలు
నూనె - 250 గ్రా.
అల్లం, వెల్లుల్లి ముద్ద - 6 చెంచాలు
ఉప్పు - అర గ్లాసుడు
కారం పొడి - ఒక గ్లాసు
జీలకర్ర పొడి - పావు గ్లాసులో సగం
మెంతిపొడి - 1 టేబుల్ స్పూన్
కొబ్బరి పొడి - అర గ్లాసుతో
ధనియాల పొడి - పావు గ్లాసుతో
ఆవాలు, జీలకర్ర - 4 చెంచాలు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక బేసనలో కారం పొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఎర్రబడ్డాక దింపేయాలి.
నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత మామిడి ముక్కలు, మసాలా పొడుల మిశ్రమం వేసి బాగా కలియబెట్టి జాడీలోకి ఎత్తుకోవాలి. ఈ పచ్చడి తినటానికి మంచి రుచిగా వుంటుంది.