పాత చింతకాయ పచ్చడి 

 

 

పాత చింతకాయ పచ్చడి... వింటుంటేనే నోరూరుతుంది కదా... పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ పచ్చడిని ఇష్టపడని వారుండరు. చాలా రోజులు నిల్వఉండే పచ్చడి కనుక ఒకేసారి చేసిపెట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకుందాం...

 

కావలసిన పదార్ధాలు :

పాత చింతకాయ తొక్కు - 1 కప్పు 

బెల్లం - 1/2 కప్పు 

ఎండుమిర్చి - 10 

పచ్చిమిర్చి - 5 పెద్దవి 

ఇంగువ - తగినంత 

నువ్వులనూనె - 1/4 కప్పు 

పోపుగింజలు - ౩ - 4 స్పూన్స్

కరివేపాకు - 10 రెబ్బలు 

వెలుల్లి రెబ్బలు - 8 

 

తయరుచేసుకునే విధానం :

ముందుగా పాన్ వేడిచేసి.. మినపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర నూనెలో దోరగా వేయిస్తూ పచ్చిమిర్చి ముక్కలు, వెలుల్లి పాయలు ఎండు మిరపకాయలు ఇంగువ వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. 

 

ఇప్పుడు చింతకాయ తొక్కు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి... మిక్సీలో మెత్తగా నూరి అందులో చితపండు తొక్కు బెల్లం వేసి పచ్చడిగా రుబ్బాలి.

 

కొద్దిగా గట్టిగా ఉన్నట్లయితే కాచి చల్లార్చిన నీరు కలిపి రుబ్బుకోవాలి... గిన్నెలోకి తీసుకుని నూనెలో వేయించిన ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు పై నుంచి వెయ్యాలి.

 

ఆరోగ్యభారితమైన  ఈ పచ్చడి పథ్యానికి రుచికి చాలా చాలా బావుంటుంది.