బెల్లం ఆవకాయ

 

 

 

ఇప్పటి వరుకు కారంగా ఉండే రకరకాల ఆవకాయ పచ్చళ్లు ఎలా పెట్టుకుంటారో చూశాం కదా. ఈ రోజు కొంచెం తియ్యగా ఉండే బెల్లం ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం.

 

కావలసిన పదార్ధాలు:

మామిడికాయలు - 3

కారం - 3 కప్పులు

ఉప్పు - 3 కప్పులు

మెంతుపిండి - 2 చెంచాలు

బెల్లం - పావుకిలో

 

తయారీ విధానం:

ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి వాటిని చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి.

 

ఇప్పడు మెంతులు దోరగా వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కూడా తురుముకొని పెట్టుకోవాలి.

 

ఇప్పుడు ఒక  గిన్నె తీసుకొని దానిలో మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, బెల్లం  మెంతుపొడి వేసి కలుపుకోవాలి.

 

ఇప్పుడు దీన్ని రెండు గంటల పాటు (పాకం చిక్కబడే వరకు)ఎండలో పెట్టుకోవాలి. అప్పుడు బెల్లం వల్ల పాకం చిక్కపడి పడుతుంది.

 

ఇది కొంచెం తియ్యగా ఉండి దోశ, ఇడ్లీ వంటి వాటిలో తినడానికి చాలా బాగుంటుంది.