జగన్ చాంబర్ లోకి నీళ్లు అలా వచ్చాయి... జేఎన్టీయూ నిపుణులు..

 

ఏపీ అసెంబ్లీ వర్షం నీరు లీకేజ్ పై దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చింది. ఏపీలో భారీ వర్షం కారణంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఛాంబర్‌లోకి నీళ్లు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాకినాడు జేఎన్టీయూ నిపుణుల బృందం పరిశీలించి.. జగన్ చాంబర్ లోకి వచ్చిన నీరు పీవీపీ పైపు ద్వారానే వచ్చినట్టుగా తేల్చి చెప్పారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు లేవని.. అసెంబ్లీ స్లాబ్ లో ఎలాంటి లీకేజ్ లేదని చెప్పారు. పీవీసీ పైపులో మళ్లీ నీళ్లు పోసి చూశామని..  నిపుణులు.. పోసీన నీళ్లన్నీ జగన్ చాంబర్ లోకి వచ్చాయని.. పీవీపీ పైపు ద్వారానే వర్షపునీరు వచ్చాయని చెప్పారు.