యోగి హెయిర్ కట్ వివాదం..

 

ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే సీఎం యోగి ఆధిత్యనాథ్ సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరికి షాకులిస్తుంటే..ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. యోగి ఆదిత్యనాథ్ హెయిర్ స్టైల్.  యూపీలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించి.. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హెయిర్‌ స్టైల్‌ను ఫాలో కావాలని విద్యార్థులను ఆదేశించిందట. లేకపోతే స్కూల్లోకి అనుమతించబోమని హెచ్చరించిందట. దీంతో యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు. ఇక దీనిపై స్పందించిన యాజమాన్యం.. వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని...మంచి వస్త్రధారణ, హెయిర్‌ కట్‌తో రావాలని మాత్రమే తాము సూచించామని స్పష్టం చేసింది.