లైట్లకింద పనిచేస్తే కేన్సర్?

రాత్రిళ్లు నిద్రపోకుండా ఉద్యోగాలు చేసే పురుషులకు రకరకాల కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. రాత్రిళ్లు ఉద్యోగాలకు వెళ్లే పురుషులపై వైద్య పరిశోధనలు జరిపినప్పుడు వాళ్లకి ప్రొస్టేట్. పెద్దపేగు, ఊపిరి తిత్తులు, మూత్రకోశ, పురీషనాళ, క్లో కేన్సర్, నాన్ హడ్గ్కిన్స్ కణతి లాంటి కేన్సర్లొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది.

రాత్రివేళల్లో కరెంట్ లైట్ల కింద పనిచేయడంవల్ల నిద్రకి ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ హార్మోన్ రోగ నిరోధక వ్యవస్థని పటిష్టం చేయడానికి కూడా పనికొస్తుందని ధృవీకరించారు కూడా.. నిద్రలేమివల్ల కేన్సర్లు మాత్రమే కాక రకరకాలైన మానసిక జబ్బులొచ్చే అవకాశంకూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.