కనీసం సెకండ్ ప్లేస్... లేదంటే ఇబ్బందులే...

 

వరంగల్ ఉపఎన్నిక కోసం అధికార పార్టీతోపాటు మిగతా ప్రధాన పార్టీలన్నీ ముమ్మర కసరత్తు చేస్తున్నాయి, వరంగల్ ను తిరిగి నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్, ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ-టీడీపీ కూటమి, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది, అయితే వరంగల్ రిజర్వుడు సీటు కావడంతో అన్ని పార్టీలూ... ఆర్ధిక బలమున్న అభ్యర్ధుల కోసం వెదుకుతున్నాయి, అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలిసింది, ఆర్ధిక బలమున్న వివేక్ ను బరిలోకి దించితేనే మంచిదని కాంగ్రెస్ అధిష్టానానికి పీసీసీ నేతలు నివేదించినట్లు తెలిసింది, పోటీకి వివేక్ ఒప్పుకోని పక్షంలోనే ఇతర అభ్యర్ధుల వైపు చూడాలని సూచించారు, దాంతో వివేక్ ను పోటీ చేయాలని అధిష్టానం కోరిందని టాక్ వినిపిస్తోంది, మరోవైపు వరంగల్ ఉపఎన్నికను బీజేపీ-టీడీపీ కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని, లేదంటే కనీసం రెండో ప్లేస్ లోనైనా ఉండాలని, లేదంటే అసలుకే మోసం వస్తుందని టీపీసీపీ నేతలు అంటున్నారు.