గోడకూలి ఇద్దరు చిన్నారులు...

 

గోడకూలి ఇద్దరు చిన్నారులు మరణించారు. హైదరాబాద్ నగరంలోని బోరబండ దేవయ్య బస్తిలో ఈ విషాద ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి ఓ ఇంటి గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మరణించగా, వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగా పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన రాజు దేవయ్య బస్తీలోని ఆ ఇంటిలో సోమవారం నాడే అద్దెకి దిగాడు. సోమవారం కురిసిన వర్షానికి బాగా తడిసిన ఇల్లు అర్ధరాత్రి సమయంలో కుప్పకూలింది. మృతి చెందిన చిన్నారులు నవ్య(4), చరణ్‌(2)గా గుర్తించారు. గాయపడిన దంపతుల్లో భర్త కాలు విరిగింది. భార్య ఇంకా అపస్మారక స్థితిలోనే వుంది.