లేడి డాక్టర్ ఆత్మహత్య...విజయవాడలో కలకలం...

 

విజయవాడలో ఓ మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంతో కలకలం రేగుతోంది. వివరాల ప్రకారం...విజయవాడ అశోక్‌నగర్‌లో సుష్మఅనే యువతి లేడీ డాక్టర్ గా పని చేస్తుంది. అయితే ఆమె ఉరి వేసుకొని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

ఇదిలా ఉండగా.. సుష్మ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిది ఖచ్చితంగా హత్యే అని.. తన భర్తే సునీల్ హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని... మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు గడిచినా కుటుంబసభ్యులు సుష్మ అంత్యక్రియలు చేయలేదు. దీంతో పోలీసులు సునీల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.