తెలంగాణ సాగునీటి నిపుణుడు విద్యాసాగర్ రావు మృతి..

 

టీఆర్ఎస్ సాగునీటి సలహాదారు, ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్ రావు మృతి చెందారు. కొంతకాలంగా ఎక్స్టెన్సివ్ మెట‌స్టాటిక్ బ్లాడ‌ర్ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్ రావు ఈరోజు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా విద్యాసాగర్ రావు నల్లొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14న జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందిన ఆయన కేంద్రం జల సంఘం చీఫ్ ఇంజనీర్ గా దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు పైగా పనిచేశారు. ప్రాజెక్టుల రీడిజైన్, మిషన్ కాకతీయలలో విద్యాసాగర్ రావుది కీలకపాత్ర. అంతేకాదు కాళేశ్వరం, పాలమూరు, దిండి ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించిన ఘనత కూడా ఆయనదే. చేసింది ఇంజనీరు పనైనా కొలువులో ఉన్నన్నాళ్లూ మంచి రచయితగా, నటుడిగా పాపులరయ్యారు. నీళ్లు-నిజాలు పేరుతో పుస్తకాలు కూడా రచించారు విద్యాసాగర్ రావు.