నటుడు దేవెన్ వర్మ కన్నుమూత

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు దేవెన్ వర్మ (78) మంగళవారం ఉదయం పూణెలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సందర్భంగా దేవెన్ వర్మ స్మృతికి పలువురు బాలీవుడ్ నటీనటులు, నిర్మాతలు నివాళులు అర్పించారు. వీరిలో కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్, మనోజ్ బాజ్‌పాయి, అనుష్క శర్మ తదితరులున్నారు. దేవెన్ వర్మ 1961 సంవత్సరంలో విడుదలైన ‘ధర్మ్‌పుత్ర’ సినిమాతో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1993లో విడుదలైన ‘కలకత్తా మెయిల్’ సినిమా ఆయన చివరి చిత్రం. దేవెన్ వర్మ ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే నటించారు. ఆయనకు అనేకసార్లు బెస్ట్ కమెడియన్‌గా ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.