ట్రంప్ కోడలిపై రసాయన దాడి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోడలు వానెస్సాపై రసాయన దాడి జరిగింది.. నిన్న తన ఇంటికి వచ్చిన ఓ పార్శిల్‌ను ఆమె తెరచి చూడగానే.. ఒక్కసారిగా అందులోని పౌడర్ ఎగసిపడింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వానెస్సాతో పాటు ఆమె తల్లి, ఇంట్లోని బంధువులు అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత సిబ్బంది వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. పౌడర్ మీద పడగానే ట్రంప్ కోడలు కళ్లు తిరిగి పడిపోయారని.. విపరీతమైన దగ్గు, తల తిరిగిన లక్షణాలు కనిపించడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆ పార్శిల్‌లో ప్రాణాంతక కెమికల్స్ ఏమీ లేవని ల్యాబ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఘటనపై వైట్ హౌస్ రంగంలోకి దిగింది. ఆ పార్శిల్‌ను ఎవరు పంపారు.. ఎందుకు పంపారు అన్న దానిపై ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు.