కస్టడీలోకి ఈవీఎంలు...

 

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో భాజపా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు గాను ప్రతిపక్షపార్టీలు బీజేపీ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో వాడిన ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయంటూ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరఖండ్ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలలో ఏ బటన్‌ నొక్కినా అది భాజపాకే వెళ్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈరోజు దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈవీఎంలను జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగా.. ఈవీఎంలపై కాంగ్రెస్‌తో పాటు.. ఆమ్‌ఆద్మీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.