యూపీ అసెంబ్లీలో గందరగోళం... గవర్నర్ పై కాగితాలు

 

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు అనంతరం మొదటిసారి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. గవర్నర్ రామ్ నాయక్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపైకి కాగితపు బంతులు, పోస్టర్లు విసిరారు. దీంతో ప్రసంగాన్ని ఆపేసి గవర్నర్.. ‘ఉత్తరప్రదేశ్ మొత్తం మిమ్మల్ని చూస్తోంది’ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. అయినా ప్రతిపక్షాలు అలానే ఆందోళన చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన మార్షల్స్ తమ చేతుల్లోని ఫైళ్లు, పుస్తకాలతో రామ్ నాయక్ కు అడ్డుగా నిలిచారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.