స్మృతి ఇరానీకి చేదు అనుభవం.. గాజులతో దాడి....


కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమెపై గాజులు విసిరేశాడు. వివరాల ప్రకారం..  ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్బంగా గుజరాత్ లోని ఆమ్రేలీలో ఓ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న స్మృతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా... కాస్వాలా అనే వ్యక్తి లేచి రెండు మూడు గాజులు ఆమెపైకి విసిరాడు. అయితే కాస్త దూరంలో ఉండటంతో గాజులు ఆమెపై పడలేదు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా...రైతులపై రుణమాఫీ, అప్పుల విషయాన్ని కేంద్రమంత్రి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇలా చేశాసని చెప్పుకొచ్చాడు.