దినకరన్ ఇంట్లో కూడా సోదాలు...

 


పార్టీ గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు ఆయనకు ఐదు రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే ఇప్పుడు పోలీసులు... ఆయన నివాసంలో కూడా సోదాలు జరుపుతున్న్టట్టు సమాచారం. అందుకు గాను చెన్నైలోని దినకరన్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు కూడా కోర్టు నుంచి ఢిల్లీ పోలీసులు అనుమతి తీసుకున్నారట. పార్టీ చిహ్నం కోసం రూ.50 కోట్లు ఎరగా వేయడం వెనుక దినకరన్‌ ఒక్కడి హస్తం మాత్రమే ఉండే అవకాశాలు లేదని.. ఈ కేసులో పది కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా, పట్టుబడింది మాత్రం రూ.1.3 కోట్లే కావడంతో మిగిలిన మొత్తంపై లెక్క తేలాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఆయన సతీమణిని కూడా పోలీసులు విచారణ చేయనున్నట్లు సమాచారం.