బాబోయ్ టీఆర్ఎస్.. తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ
posted on Apr 11, 2015 12:47PM
టీఆర్ఎస్ ని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ ప్రకటించారు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని చిత్తు చేసిందని, అలాగే తెలంగాణలో అన్ని పార్టీలను టీఆర్ఎస్ పార్టీ ఊడ్చేసిందని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కొంతమందిని చేర్చుకుంటూ నాయిని ఈ వ్యాఖ్యలను చేశారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన బోలెడు మంది నేతలు తమ పార్టీలో చేరడానికి ఏంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని, కానీ వారిని తాము తీరస్కరించడంతో అక్కడే ఆగిపోయారని చెప్పారు. తమ దెబ్బకి కాంగ్రెస్, టీడీపీలు గల్లంతయిపోయానని నాయిని అన్నాడు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి, టీఆర్ఎస్ కు పోలిక ఎక్కడ వుందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తొలిసారి అధికారం చేతికి వచ్చినప్పుడు ఇలాగే అనిపిస్తుందని అంటున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జనాల సహకారంతో ఇతర పార్టీలను ఊడ్చేసింది కానీ టీఆర్ఎస్ లాగా అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దాహంతో వచ్చే నేతలను పార్టీలో చేర్చుకొని, ఆయా పార్టీలను ఊడ్చేశామ౦టు చెప్పుకోవడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.