కాంగ్రెస్ సీనియర్ నేత టీఆర్ఎస్ లోకి...
posted on Jul 8, 2017 12:28PM
.jpg)
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసలు పర్వం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు సమాచారం. అతనెవరో కాదు..కాంగ్రెస్ తరపున ఉన్నత పదవులను అధీష్టించిన వ్యక్తి.. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా. ఈయనను పార్టీలో చేరమని తెరాస నేతలు ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. కాగా గత ఎన్నికల్లో అంథోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బాబూ మోహన్ చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల తెరాస అధినేత కేసీఆర్ చేయించుకున్న సర్వేలో బాబూ మోహన్ పనితీరు అంత బాగోలేదని తేలడంతో.. మరో నేతను తీసుకురావాలన్న నేపథ్యంలో కేసీఆర్ దామోదరను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.