ట్రిపుల్ తలాక్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఆ విషయాన్ని మాత్రమే విచారిస్తాం..!

 

ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై గత కొద్దికాలంగా సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్నసంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఈ విషయంపై సుప్రీంకోర్టు.. ట్రిపుల్ తలాక్ విషయాన్ని బయట తేల్చుకోవాలని.. కావాలంటే తాము మద్యవర్తిగా ఉంటామని చెప్పింది. అయితే ఈరోజు దీనిపై విచారణ జరగగా... ట్రిపుల్‌ తలాక్‌ ఇస్లాం మతానికి సంబంధించిన ప్రాథమిక అంశమా? కాదా? అనే విషయాన్ని మాత్రమే విచారిస్తామని పేర్కొంది. ట్రిపుల్‌ తలాక్‌ ఇస్లాం మూలసూత్రాల్లో ఎటువంటి స్థానం ఉంది అనే అంశాన్ని పరిశీలిస్తామని.. ఇక బహుభార్యత్వంపై మాత్రం విచారణ చేపట్టమని తెలిపింది. కాగా చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం వీటిపై వాదనలను విననుంది. అయితే దీనిలోని ఐదుగురు న్యాయమూర్తులు ఐదు విభిన్న మతాలకు చెందినవారు కావడం విశేషం. సీజే జస్టిస్‌ ఖెహర్‌(సిక్కు), జస్టిస్‌ కె. జోసఫ్‌(క్రిస్టియన్‌) జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌ నారీమన్‌ (పార్సీ), జస్టిస్‌ యు.యు.లలిత్‌(హిందూ), అబ్దుల్‌ నాజీర్‌(ముస్లిం).