కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు వేడుక

 

మంగళవారం నాడు ‘తెలుగువన్’ 15వ వార్షికోత్సవంతోపాటు, ‘తెలుగువన్’ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు కావడం కూడా విశేషం. ‘తెలుగువన్’ వార్షికోత్సవంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు కంఠంనేని రవిశంకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘తెలుగువన్’ కుటుంబ సభ్యుల సమక్షంలో కంఠంనేని రవిశంకర్ తన బర్త్ డే కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా ‘తెలుగువన్’ కుటుంబ సభ్యులు కంఠంనేని రవిశంకర్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.