తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సమ్మె

 

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మికులు సోమవారం నుంచి సమ్మెబాట పట్టారు. వేతన సవరణతో సహా 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏడు కార్మిక సంఘాలు గతంలో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆరవ తేదీ నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కార్మికులతో జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ సంచాలకుడు చర్చలు జరిపారు. కార్మికుల డిమాండ్ల అమలుకు హామీ ఇచ్చారు. అయితే వాటిని అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు.