కేసీఆర్ నిర్ణయం.. తెలుగు చెప్పాల్సిందే..

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు భాషకు పెద్ద పీఠం వేసేందుకు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను కచ్చితంగా బోధించాల్సిందేనని... లేదంటే.. తెలుగు బోధించే పాఠశాలలకు మాత్రమే అనుమతి ఇస్తామని ఆదేశించారు. అంతేకాదు  ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్‌లలో బోధించే తెలుగు సబ్జెక్టులకు సిలబస్ రూపొందించాల్సిందిగా సాహిత్య అకాడమీకి ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై బోర్డులు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలని సూచించారు.