అక్బరుద్దీన్ రియాక్ట్ వెనుక కారణం అదా?
posted on Sep 30, 2015 11:32AM
తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో ఐఏఎంపార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అధికార పార్టీని కడిగేసిన సంగతి తెలిసిందే. రైతు ఆత్మహత్యలపై ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చిన కేటీఆర్ కు కూడా ఘాటుగా సమాధానం చెప్పి కేటీఆర్ నోరు మూయించాడు.. దాంతో మంత్రి హరీశ్ రావు కూడా కల్పించుకొని అక్బరుద్దీన్ వాగ్దాటికి బ్రేక్ వేద్దామని చూసినా కూడా అది వర్కవుట్ కాలేదు. ఆవిధంగా మొత్తానికి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రైతు ఆత్మహత్యల విషయంపై అధికార పార్టీని ఇరుకున పెడదామని అనుకున్న నేపథ్యంలో ఆ పని అక్బరుద్దీన్ ఒకరే చేసి చూపించారు.
అయితే రైతు ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవ్వడానికి అసలు కారణం వేరే ఉందట. అదేంటంటే.. గతంలో ఒకసారి అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన దాని గురించి చెపుతూ మృత్యుముఖం వరకూ వెళ్లి వచ్చిన నాకు ఆ బాధ ఏంటో తెలుసని.. నేను రైతును కాకపోయినా.. ఆ రైతు కుటుంబం బాధ ఏలా ఉంటుందో తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. చావు వరకూ వెళ్లిన నాకు ఆ బాధ తెలుసు ఇంటి పెద్దకు ఏదైనా అయితే కుటుంబ సభ్యులు ఎలాంటి బాధ అనుభవిస్తారో నేను ప్రత్యక్షంగా చూశానని వ్యాఖ్యానించారు. మొత్తానికి అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవడానికి పర్సనల్ ఎక్స్ పీరియన్స్ కారణం అన్నమాట..