జగన్ సీమాంధ్ర ద్రోహి... సోమిరెడ్డి

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని విడదీసి తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కేసీఆర్ కు జగన్ మద్దతు ఇవ్వడం జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. జగన్ కేసీఆర్ కు మద్దతివ్వడంతో సీమాంధ్రులకు ద్రోహిగా మారారని అన్నారు. వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ జగన్ కుమ్మక్కయి ఎన్ని కుట్రలు చేసినా తెలుగు దేశం పార్టీని ఏం చేయలేరని ప్రజలకు టీడీపీ పై నమ్మకం ఉందని అన్నారు.