ఎంపీగారు ఇకనైనా ఆపండి
posted on Aug 24, 2015 10:18AM
కొంత మంది రాజకీయ నాయకులు చేసే కొన్ని పనులు వారికి సమస్య కాకపోవచ్చుకాని పక్కన వాళ్లకు మాత్రం సమస్యగానే ఉంటుంది. ఏదో చేయాలని చూస్తే ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ నేత చేసిన ఓవరాక్షన్ వల్ల ప్రధాని మోడీ సెక్యూరిటీ గార్డులలో ఇద్దరు గార్డులపై వేటు పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక టీడీపీ ఎంపీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తున్నట్టు.. ప్రధాని తను ఎక్కువ క్లోజ్ అన్నట్టు.. ఎప్పుడు మీడియాలో కనిపించాలని తెగ ప్రయత్నిస్తున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ఈ టీడీపీ ఎంపీ గారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి అంత్య క్రియల నేపథ్యంలో ప్రధానికి అతి సమీపంలో నడవడానికి ప్రయత్నించారట. అంతేకాదు ప్రధాని మంత్రి చైనా యాత్ర చేసినప్పుడు కూడా ఆపర్యటనలో తను కూడా ఉన్నట్టు తన పేరు కూడా ఉండేలా పేరు రాయించుకున్నారంట దీంతో అందరూ ఆ ఎంపీ గారికి చీవాట్లు పెట్టి పంపారు. దీంతో ప్రధానికి కూడా ఎంపీ గారి వ్యవహారం నచ్చలేదంట.
ఇదంతా మన ఎంపీగారు ఎందుకు చేస్తున్నారంటే తనకు ఉన్న OTS ( one time settlement ) బ్యాంకు అఫ్రూవల్ కోసమే అని.. ప్రధాని తనకు బాగా క్లోజ్ అని తెలిసేలా చేస్తే దానిని ఎలాగైనా చేయించుకోవచ్చని చూశారంట కాని ప్రధాని కార్యలయం మాత్రం దానిని రిజెక్ట్ చేసిందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదొక్కటే కాదు ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక భూమి విషయంలో కూడా ఈ ఎంపీగారు అలాగే వ్యవహరించినట్టు తెలుస్తోంది. వైజాగ్ లో ఉన్న భూమిని అధికారులను మభ్యపెట్టి రెగ్యులైజ్ చేసుకోవడానికి ప్రయత్నించారట. కాని అధికారులు సీఎం ఆ ఫైల్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ ఎంపీగారి వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారట. అయినా ఇన్ని భంగపాట్లు పడినా కూడా ఈ ఎంపీగారి మాత్రం తను ధోరణిలో తానే ఉన్నారని ఇంకా మారలేదని నవ్వుకుంటున్నారు. అయినా కూడా ముఖ్యమంత్రిగారికి.. పీఎం గారికి దగ్గరగా ఉండే ప్రయత్నాలే చేస్తున్నారంట. అసలే ఇప్పటికే అర్ధికపరంగా సమస్యలతో ఈ ఎంపీగారికి మరి ఆయన చేసే ప్రయత్నాలు ఎంతవరకూ పనిచేస్తాయో చూడాలి.