విద్యుత్ పై తెలుగుదేశం సమరశంఖం

TDP Fasting Against Power Problem, TDP To Continue Fasting, Fasting Countinues TDP MLA's.

 

ఇందిరా పార్క్ వద్ద లెఫ్ట్ నేతల నాలుగురోజుల నిరాహారదీక్షను భగ్నం చేసి గాంధీ ఆసుపత్రికి తరలించింది. బుధవారం లెఫ్ట్ నేతలు దీక్షను విరమించారు. ఇప్పుడు తెలుగుదేశం వంతు మొదలైంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లొ తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరాహారదీక్షలు మొదలుపెట్టారు. బుధవారంతో రెండు రోజుల దీక్ష దిగ్విజయంగా పూర్తిచేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యులతో ఫోన్ లొ మాట్లాడి కార్యాచరణ గురించి సమీక్షించారు. తెలుగుదేశం పార్టీ దీక్షా శిభిరానికి లెఫ్ట్ పార్టీ నేతలు తరలివచ్చి వారికి మద్ధతు పలికారు. బుధవారం మధ్యాహ్నం భేటీ అయిన పది లెఫ్ట్ పార్టీ నేతలు భవిష్యత్తులో చేపట్టవలసిన  కార్యాచరణను రూపొందించారు. ఏప్రిల్ 1న జిల్లా, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని, ఏప్రిల్ 9న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కరెంట్ ఛార్జీలు, పవర్ కట్, సర్ ఛార్జీలు ప్రభుత్వమే భరించేలా రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచే వరకు నిరాహార దీక్షలు విరమించకూడదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గట్టిగా నిర్ణయించుకున్నారు.