తలసాని మంత్రి పదవిపై మరో పిటిషన్
posted on Oct 29, 2015 2:04PM
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై మరో పిటిషన్ దాఖలైంది, టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమంటూ శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం వేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, ఆర్నెళ్లకు పైగా మంత్రి పదవిలో కొనసాగడం చట్ట విరుద్ధమన్న పిటిషనర్ శివప్రసాద్ రెడ్డి... మంత్రి పదవి నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ ను బర్తరఫ్ చేయాలని కోరారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుంటే ఇప్పటివరకూ ఎందుకు ఆమోదించలేదని, అయినా ఆర్నెళ్లకు మించి అలా పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ కోర్టుకు నివేదించాడు, అయితే పిల్ ను స్వీకరించిన హైకోర్టు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.