వరుస బాంబు పేలుళ్లతో అట్టుడికిపోయిన సిరియా...
posted on Jul 3, 2017 10:46AM
.jpg)
సిరియా మరోసారి బాంబు పేలుళ్లతో అట్టుడికిపోయింది. సిరియాలోని రాజధాని డమాస్కస్ లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. వివరలా ప్రకారం.. డమాస్కస్ లో ఓ ఆత్మాహుతి సభ్యుడు కారులో తనను తాను పేల్చేసుకున్నాడు. ఆ తరువాత నగర శివార్లలో భద్రతా దళాలు వాహనాలను తనిఖీ చేస్తుండగా మరో రెండు కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో మొత్తం 21 మంది చనిపోగా... పలువురు తీవ్రంగా గాయపడినట్టు సిరియా మానవ హక్కుల సంఘం తెలిపింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించడంతో ఇప్పుడు జరిగిన పేలుళ్లకు కూడా ఐసిసే కారణమై ఉంటుందని సిరియా ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.