"జనసేన"లోకి సుజనా.. అందుకే ఇలా..!

 

గత కొద్దిరోజులుగా సుజనా చౌదరి పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పదవికి తాను ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటినుండి  ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే 'సుజనాచౌదరి' పవన్‌ కళ్యాణ్‌ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే..దీనికి సంబంధించి...చర్చలు పూర్తి అయ్యాయని...ఆయన త్వరలో అధికారికంగా 'జనసేన' పార్టీలోకి చేరతారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. నిజానికి తన పదవికి రాజీనామా చేసిన తరువాత సుజనాచౌదరి పార్టీ కార్యక్రమాల్లో మునుపటిలా పాల్గొనటంలేదనే చెప్పొచ్చు. టిడిపి కార్యక్రమాల్లో 'సుజనా' మొక్కుబడిగా పాల్గొంటున్నారు.ఏ కార్యక్రమంలోనూ..ఆయన పాల్లోవడం లేదు. టిడిపి విజయవాడలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలోనూ 'సుజనా' పాల్గొనలేదు. ఇక తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏదో నామ్ కే వాస్త్ పాల్గొని చంద్రబాబు రాకముందే ప్రసంగించి... ఆయన రాకముందే వెళ్లిపోయారు.

 

దీనికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి. బిజెపితో...పొత్తు తెంచుకోవడం 'సుజనా'కు ఇష్టం లేదట. వారితోనే కలసి వెళ్లాలనేది ఆయన ఉద్దేశ్యమట. కానీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా.. ఇంకా బీజేపీతో ఉంటే ఏపీ ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని భావించి చంద్రబాబు వారితో తెగదెంపులు తెంచుకున్నారు. అందుకే సుజనా కాస్త అసంతృప్తితో ఉన్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్నంత ఇంట్రస్టింగ్ గా పాల్గొనడం లేదట. ప్రస్తుతం తనకు సంబందించిన వ్యాపార విషయాలపై ఎక్కువ శ్రద్దపెడుతున్నారని, ఢిల్లీలో బిజెపి నాయకులతో కలసి తిరుగుతున్నారని... ఆయన పార్టీలో ఉండడం కష్టమేనని..ఓ సీనియర్‌ టిడిపి నేత వ్యాఖ్యానించారు. ఇక ఆయన మాటలను నిజం చేస్తూ... .'సుజనా' 'జనసేన' పార్టీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపిలోకి ఆయన వెళ్లలేరు...అందుకే 'జనసేన'ను ఎంపిక చేసుకున్నారని... ఇప్పటికే..తనకు చెందిన ఛానెల్‌ను..'జనసేన'కు అనుకూలంగా మార్చారని...'ప్రస్తుతం 'పవన్‌' సభలకు, కార్యక్రమాలకు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.