సుచీలీక్స్... సినీ రంగంలో సెక్స్ ఒక సైలెంట్ రూలా?

 

సుచీ లీక్స్ ... ఇప్పుడు ఈ పదాలు వినిపిస్తే చాలు సౌతిండియన్ సినిమా సెలబ్రిటీలు బెదిరి కళ్లు తేలేస్తున్నారు. నిజానికి ట్విట్టర్ లో సింగర్ సుచిత్రా బయటపెట్టిన ఫోటోలు అలాంటివి మరి! నెక్స్ట్ నెంబర్ ప్రియమణిదంటూ చెప్పిన సుచీలీక్స్ .... ఇండస్ట్రీ వారితో భయానక రాగాలు పాడిస్తోంది! ఇంతకీ సుచీ లీక్స్ ఎవరు చేస్తున్నారు? సింగర్ సుచిత్రనే అంత సాహసం చేస్తోందా? లేక మరెవరైనా ఆమె అకౌంట్ హ్యాక్ చేశారా? హ్యాక్ చేస్తే అధికారికంగా సుచిత్రా తన అకౌంట్ ని బ్లాక్ చేయించవచ్చు కదా? పోలీసుల్ని ఆశ్రయించవచ్చు కదా? ఆమెకేమైనా మానసిక రుగ్మత వుందా? ఇలా బోలెడు ప్రశ్నలు! కాని, అవ్వనికంటే ప్రధానమైన ప్రశ్న మరొకటి వుంది...

 

సుచిత్రా అనే సింగర్ సినిమా సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు బయట పెట్టి సాధించింది ఏమిటి? ఒకటి అరా వీడియోలు జనంలోకి వదిలి చెప్పదలుచుకుంది ఏంటి? ఈ కొశన్స్ చాలా ఇంపార్టెంట్! నిజంగా సుచిత్రా అనే గాయని నటీ, నటులు, గాయనీ, గాయకులు, సంగీత దర్శకుల బండారాలు బయటపెడుతుందో లేదో పెద్ద ముఖ్యం కాదు. కాని, జనాలు అభిమానించే పేరున్న సినిమా వాళ్లు అడ్డంగా బుక్కైపోయారు. ఇది నిజం. ఇంకా మరికొందరి ఫోటోలు , వీడియోలు కూడా రాబోతున్నాయి. అవ్వి కూడా వచ్చినా పెద్దగా నష్టం జరుగుతుందని భావించటానికి ఏం లేదు. ఎందుకంటే, ఇలాంటి ఫోటోలు , వీడియోలు వల్ల కెరీర్స్ పాడైపోయే దశ మన దేశం ఏనాడో దాటిపోయింది! ఉదాహరణకి సుచీ లీక్స్ త్రిషా రెండు ఫోటోల్లో కనిపించింది. రానాతో, ధనుష్ తో ఆమె క్లోజ్ గా వున్న ఇమేజెస్ అవ్వి. కాకపోతే, ఇదే త్రిషా గతంలో ఒక న్యూడ్ వీడియో న్యూసెన్స్ ఎదుర్కొంది! అది ఆమెదో కాదో ఇప్పటికీ ఎవరూ అధికారికంగా చెప్పలేకపోతున్నారు. కాని, అలా ఒక న్యూడ్ వీడియో వచ్చినా కూడా త్రిషని ఆదరించటం మానలేదు జనం. అదే ఒకప్పుడైతే సదరు హీరోయిన్ పరువు పోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది!

 

 

సుచీలీక్స్ వ్యవహారం కూడా కొన్నాళ్లకు చల్లబడిపోతుంది. లీక్ చేసింది స్వయంగా సుచిత్రే అయినా కాకున్నా, ఆమె ట్విట్టర్ అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసినా, చేయకున్నా... జనం సినిమా వాళ్ల రొమాంటిక్ వ్యవహారాల్ని సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే, వారు మతంతో సంబంధం వున్న సన్యాసులు కారు. జనం వద్దకి ఓట్లు అడిగేందుకు వచ్చే రాజకీయ నాయకులు కూడా కాదు. అన్నిటికీ మించి సినిమా రంగంలో అడ్జెస్ట్ మెంట్ లు మామూలేనని అందరికీ తెలుసు. గ్లామర్ ప్రపంచంలో డబ్బులాగే, శృంగారం కూడా ఇచ్చిపుచ్చుకుంటారనేది పబ్లిక్ సీక్రెట్! అందుకే,నాలుగు రోజులు ధనుష్, త్రిషా, హన్సిక, ప్రియమణి లాంటి వారి గురించి మాట్లాడుకుంటారేమోగాని జనం వాళ్లపై ఆగ్రహించే ఛాన్స్ అస్సలు లేదు. అయితే గియితే మరి కాస్త ఫ్రీ పబ్లిసిటీ వచ్చిపడుతుంది!

 

సినిమా రంగంలో జరిగే చీకటి వ్యవహారాలపై సినిమా వాళ్లు సరైన విధంగా దృష్టి పెట్టరు. లేదంటే కావాలనే ఆ కోణాన్ని ఆవిష్కరించరు. దేశ ప్రధాని, అమెరికా అధ్యక్షుడ్ని కూడా వదలకుండా సినిమాల్లో చూపించే మనోళ్లు తమ స్వంత రంగంలో ఎంతగా లైంగిక వేధింపులు, క్రైమ్ వుంటాయో కళ్లకు కట్టినట్టు చూపించరు. ఎప్పుడో ఒకటి రెండు సినిమా రంగం నేపథ్యంలో నడిచే సినిమాలు వచ్చినా అసలు పరిస్థితి ఏ భారతీయ దర్శకుడూ చూపించలేదు. అందుకే, కొంత వరకూ సినిమా రంగం విషయంలో సామాన్య జనానికి అవగాహన తక్కువ. అయినా కూడా అప్పుడుడప్పుడూ జరిగే ఈ సుచీలీక్స్ , భావన కిడ్నాప్ వ్యవహారం లాంటివి మొత్తం అంతా బయటపెట్టేస్తుంటాయి! రాజకీయాల్లో, క్రీడల్లో, కార్పోరేట్ రంగంలో... ఇలా అన్నింటిలో వున్నట్టే సినిమా ఫీల్డ్ లోనూ దోపిడీ వుంది. అదే సమయంలో పేరు, డబ్బు, మజా కోసం కాంప్రమైజ్ అయ్యే సంప్రదాయం కూడా వుంది. ఇదంతా ఎప్పటికప్పుడు అప్పుడే తొలిసారి వెలుగు చూసినట్లు అందరూ నటించే బహిరంగ రహస్యం!